Home » ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన ‘కంప్యూటర్ బాబా’ అరెస్ట్
Published
2 months agoon
By
nagamaniMadhya pradesh ‘Computer Baba’ arrested : మధ్యప్రదేశ్ లో కంప్యూటర్ బాబా అలియాస్ నామ్ దేవ్ దాస్ త్యాగి అంటే చాలా చాలా ఫేమస్. రాష్ట్రంలో కమల్ నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాలు కంప్యూటర్ బాబాకు 2018 లో ఏకంగా మంత్రి హోదా కల్పించాయి. రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదూ..ప్రభుత్వం అండదండలు ఎంతగా ఉన్నా..విధి వికటించడంతో కంప్యూటర్ బాబాబ జైలు పాలయ్యారు.
ఏకంగా ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టిన బాబా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలు రావటంతో సర్వేలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు ప్రయత్నించగా..కంప్యూటర్ బాబా తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఇండోర్ లోని హతోడ్ ప్రాంతంలో ఉన్న ఆయన ఆశ్రమాన్ని మూసివేశారు. కంప్యూటర్ బాబా ఆశ్రమం నిర్మించిన ప్రాంతం ఇండోర్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినది కావటంతో స్థానికు పోలీసులు ఆయన ఆశ్రమాన్ని మూసివేశారు.
ఈ అంశంపై ఇండోర్ డీఐజీ హరినారాయణచారి మిశ్రా మాట్లాడుతూ..పోలీసులు సెక్షన్ 151 (సీఆర్పీసీ) కింద కంప్యూటర్ బాబాతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. అరెస్ట్ చేసినవారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆపై వారిని సెంట్రల్ జైలుకు తరలించామని తెలిపారు. అలాగే ఇండోర్ కలెక్టర్ మనీశ్ సింగ్ కూడా స్పందిస్తూ..ప్రభుత్వ అధికారులు చేసే పనులకు బాబా అడ్డుతగిలారని అందుకే ఆయన్ని..ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు.
కాగా ఆశ్రమంలో అరెస్టుల సందర్భంగా పోలీసులు ఓ 315 బోర్ గన్, ఒక ఎయిర్ గన్, ఒక పిస్టల్, ఒక కృపాణం, ఏసీలు, ఫ్రిజ్ లు, టెలివిజన్ లు ఉన్నట్టు గుర్తించారు. వాటితో పాటు రెండు కార్లు, రెండు బైకులను సీజ్ చేశారు.
కాగా..2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ముందే కాంగ్రెస్కు తన మద్దతును అందించాలని త్యాగి నిర్ణయించారు. సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి ప్రభుత్వానికి రాజీనామా చేసిన తరువాత ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేశారు.
కమల్ నాథ్ సీఎంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, నామ్దేవ్ దాస్ త్యాగి ‘కంప్యూటర్ బాబా’ ను నర్మదా-ఖిప్రా రివర్ ట్రస్ట్ చైర్మన్గా నియమించారు.