Madhya Pradesh No leave for police

అయోధ్య కేసు : పోలీసులకు లీవుల్లేవ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పోలీసులు ఎలాంటి లీవులు తీసుకోవద్దని మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంగా తదుపరి తీర్పు వచ్చేంత వరకు సెలవులు తీసుకోవద్దని సూచించారు. నవంబర్ 01వ తేదీ శుక్రవారం స్టేట్ పోలీసు హెడ్ క్వార్టర్ ఆర్డర్ జారీ చేసింది. జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, ఇతర పోలీసు అధికారులకు వర్తిస్తుందని తెలిపింది.

రాబోయే ఉత్సవాల దృష్ట్యా, మత సామరస్యాన్ని..శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మిలాద్ ఉన్ నబీ, గురునానక్ జయంతి పండుగలు, అయోధ్య తీర్పు త్వరలో రానున్నాయని, నవంబర్ 01వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సెలవులు తీసుకోవడం నిషేధించబడిందని సర్క్యూలర్‌లో పేర్కొంది. అత్యవసర పరిస్థితులు వస్తే..సెలవు కోసం పోలీసు అధికారులు, ఇతర ఉద్యోగులు సీనియర్ల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించారు. 

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య అంశంపై మారథాన్ విచారణ జరిపింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రామ్ జన్మభూమి, బాబ్రీ మసీదు అంశంపై తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపావళి సెలవులు కొనసాగుతున్నాయి. నవంబర్ 04వ తేదీ నుంచి కోర్టు ప్రారంభమౌతోంది. నవంబర్ చివర్లో సీజేఐ పదవి విరమణకు ముందే..తుది తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 
Read More : నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు – మమత బెనర్జీ

Related Posts