Home » రెండు రోజులకే మూతపడిన నాథూరాం గాడ్సే లైబ్రరీ
Published
1 week agoon
Two days after opening, Nathuram Godse library shut : మహాత్మాగాంధీని హంతకుడు నాథూరం గాడ్సే లైబ్రరీ ప్రారంభించిన రెండు రోజులకే మూతపడింది. విశ్వ హిందీ దివాస్ సందర్భంగా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మహాత్మాగాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే గుర్తుగా గాడ్సే లైబ్రరీని అఖిల్ భారతీయ హిందూ మహాసభ ప్రారంభించింది. గాడ్సే జీవితం భావజాలానికి అంకితమైన గ్వాలియర్‌లో ఈ గాడ్సే లైబ్రరీని ప్రారంభించింది. దౌలత్ గంజ్‌లోని మహాసభ కార్యాలయంలో గాడ్సే లైబ్రరీని ఏర్పాటు చేసింది.
అయితే శాంతిభద్రతల దృష్ట్యా లైబ్రరీని మూసివేసి అందులోని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గాడ్సే లైబ్రరీపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు, మెసేజ్‌లు వైరల్ అయ్యాయి. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించింది.
మరుసటి రోజే లైబ్రరీని మూసివేసినట్టు గ్వాలియర్ సూపరింటెండెంట్ అమిత్ సంఘి వెల్లడించారు. హిందూ మహాసభ సభ్యులతో సమావేశం జరిగిన అనంతరం లైబ్రరీని మూసివేశారు. లైబ్రరీలోని అన్ని సాహిత్యాలు, పోస్టర్లు, బ్యానర్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సంఘి అన్నారు.