15ఏళ్ల అత్యాచారహింసకు చరమగీతం..కామాంథుడిని 25 సార్లు పొడిచి అంతమొందించిన మహిళ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో ఓ మహిళ తన మీద 15ఏళ్లుగా జరుగుతున్న అత్యాచారానికి పాల్పడుతున్న కామాంథుడిని అంతమొందించింది. అపరకాళిలో అతడిపై విరుచుకుపడి కత్తితో 25సార్లు కసితీరా పొడిసి పొడిచి అంతమొందించింది.
తన 16 ఏళ్ల వయస్సులో తనపై అత్యాచారం చేసి దాన్ని వీడియో తీసి ఆ వీడియోతో బెదిరిస్తూ..తాను చెప్పిన మాట వినకపోతే ఈ వీడియోను అందరికీ చూపిస్తానని గత 15 ఏళ్లుగా తనపై అత్యాచారాన్ని కొనసాగిస్తున్న కామాంధుడిని కత్తితో పొడిచి అంతమొందించానని 31 ఏళ్ల మహిళ న్యాయస్థానానికి తెలిపింది.15 ఏళ్ల నుంచి తనను లైంగికంగా వేధిస్తూ నరకం చూసిస్తున్న ఆ మృగాడి బారి నుంచి తనకు విముక్తి లభించిందనీ..ఇక తాను ఏమైనా ఫరవాలేదని ధీమా వ్యక్తంచేసింది. తన జీవితాన్ని కాలరాసిన ఆ మృగాడిని అంతం చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటోంది. ఈ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు.

 

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి 214 కిలోమీటర్ల దూరంలో ఉన్న గునాలో చోటు చేసుకుంది.పోలీసులు మృతుడిని అశోక్ నగర్ నివాసి బ్రిజ్ భూషణ్ శర్మగా గుర్తించారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 302 కింద మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం ఆమెను బుధవారం (అక్టోబర్ 14,2020) కోర్టులో హాజరుపరిచారు.

తాను హత్య చేసిన వ్యక్తి 2005 నుంచి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆమె కోర్టుకు తెలిపింది. అశోక్ నగర్ నివాసి బ్రిజ్ భూషణ్ శర్మ తనకు 16 ఏళ్ల వయసులో 2005లోలో పరిచయం అయ్యాడనీ..అప్పుడే మొదటిసారి తనపై అత్యాచారం చేశాడని..ఆ అత్యాచారం అంతా వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలిపింది. తరువాత తనకు వివాహం అయ్యింది..ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

అయినా సరే ఈ వీడియోతో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ..ఈ క్రమంలో గత సోమవారం (అక్టోబర్ 12,2020)తన భర్త ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లగా ఇంట్లో తన పిల్లలతో నిద్రిస్తుండగా సదరు బ్రిజ్ భూషణ్ శర్మ మరోసారి తన ఇంటికి వచ్చి మరోసారి తనపై అత్యాచారానికి యత్నించగా..ఇక ఎన్నాళ్లు వీడిహింసలు భరించాలి? మానసికంగా..శారీరకంగా అలసిపోయాను…నా భర్తకు ఈ విషయం చెప్పలేను..అలాగనీ ఆ కామాంథుడి అఘాయిత్యాలు..హింసలు భరించలేక కూరగాయాలు కోసే చాకుతో తన 15ఏళ్ల హింసకు అతణ్ని పొడిచి కసి తీర్చుకున్నానని చెబుతూ కోర్టులో భోరున ఏడుస్తూ తన విషాదగాథను చెప్పి కుప్పకూలిపోయిందామె..

READ  డేరింగ్ లీడర్ : బారికేడ్లు దూకి వెళ్లిన ప్రియాంక

 

దీంతో ఆమె అతని బెదిరింపులకు నోరెత్తకుండా ఉండటంతో దాన్ని అలుసుగా తీసుకుని గత 15 ఏళ్లుగా ఈ వీడియోని చూపిస్తు తనను బెదిరిస్తూ..అత్యాచారంతో నరకం చూపించాడని ఆవేదనగాకోర్టుకు తెలిపింది.

 

ఆ వీడియోతో తనను పలుమార్లు అత్యాచారం చేసాడని వివరించింది. తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ కామాంధుడు తనమీద విరుచుకుపడి అత్యాచారానికి పాల్పడేవాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కోర్టుకు వివరించింది.

 

ఈ కేసుపై గునా కాంట్ స్టేషన్ ఇన్ప్సెక్టర్ రాం ప్రకాష్ వర్మ మాట్లాడుతూ..అశోక్ నగర్ కు చెందిన బ్రిజ్ భూషణ్ శర్మను హత్య చేశాక ఆమె పోలీసులు సమాచారం అందించి ఏఏ పరిస్థితుల్లో తాను హత్య చేశానో తెలిపిందని చెప్పారు.

Related Posts