లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

దేవాలయంలో పూజలు చేస్తూనే.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి

Published

on

MP congress EX mla dies: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ MLA వినోత్ డాగా దేవాలయంలో పూజలు చేస్తూనే కన్నుమూశారు. బైతుల్‌లో ఆలయంలో పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు వదిలారు. బైతూల్ మాజీ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కోశాధికారి అయిన వినోద్ డాగా ధన్‌తేరాస్ సందర్భంగా జైన్ దాదావాడీ లోని జైన్ టెంపుల్ లో పూజ చేసేందుకు వెళ్లారు.


ఆలయంలోని పార్శ్వనాథునికి పూజలు నిర్వహించిన అనంరతం ఆయన గురుదేవ్ మందిరంలో ప్రదక్షిణలు చేసిన తరువాత గురుదేవ్ పాదాలకు నమస్కరించి..పక్కకు జరిగిన కొన్ని క్షణాల్లోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అదే సమయంలో ఆలయంలోకి వచ్చిన ఓ బాలుడు వినోద్ డాగా పడిపోయి ఉండటాన్ని చూశాడు. అనంతరం గబగబా పరుగెత్తుకుంటూ వెళ్లి దేవాలయం పూజారికి ఆ విషయాన్ని చెప్పాడు.


దేశవ్యాప్తంగా విరబూస్తున్న కమలాలు…శివరాజ్ సర్కార్ సేఫ్!


ఆ మాట విన్న వెంటనే అప్రమత్తమైన పూజారి..అక్కడే ఉన్న భక్తుల సహాయంతో వినోద్ ను లేపే ప్రయత్నం చేశారు. కానీ ఆయనలో కదలిక లేకపోయేసరికి వెంటే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు దృవీకరించారు. ఆయన పూజలు చేస్తుండగా, మరణించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కాగా ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో వినోద్ డాగాకు కాంగ్రెస్ పార్టీ మెహ్‌గావ్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించగా వాటిని ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. గురువారం(నవంబర్ 12) బైతుల్‌కి రావడం కంటే ముందు… భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. వినోద్ డాగా గతంలో ఎమ్మెల్యేగా,సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *