madison-beer stuns assistant mercedes benz C 300 birthday gift

PA బర్త్ డేకు మెర్సిడెస్‌ బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన గాయని

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పీఏ బర్త్‌డే కు ఏకంగా మెర్సిడెస్ బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చింది ఓ సింగర్. చాలామంది తమ ఏదో ఒక ఉద్యోగిగా మాత్రమే చూస్తారు. కొంతమంది మాత్రం పీఏలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వారి ఇష్టాయిష్టానలు తెలుసుకుంటారు. ఉద్యగంలో భాగమే అయినా..తమ ఉన్నతి కోసం తమ వెంటే ఉండీ అన్నింటికీ చూసుకునే పీఏలను ఆత్మీయులుగా చూసుకుంటారు. అదిగో అచ్చు అంటువంటి భావాలే ఉన్నాయి పాటల సంచలనం పేరు తెచ్చుకున్న సింగర్ మాడిసన్‌ బీర్‌‌‌కు.

be

పీఏలో బర్త్ డే అంటే ఓ గిప్టు..లేదా ఓ కట్‌ చేసి చిన్న పార్టీ ఇవ్వడమే గొప్ప. కానీ మాడిసన్ మాత్రం తన పీఏ 30వ బర్త్‌డే సందర్భంగా మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. పీఏ బర్త్ డే సందర్భంగా లంచ్‌ ఏర్పాటు చేసిన మాడిసన్‌ తన పీఏకు ఎ బ్యాగ్ ఇచ్చారు. తన యజమాని తనకు ఏం గిప్టు ఇచ్చిందో ఆత్రంగా చూసిందామె.

కానీ అది ఖాళీగా ఉంది. దీంట్లో ఏవో వేస్ట్ పేపర్స్ ఉన్నాయేంటీ అనుకుంటూ తల ఎత్తి యజమాని వంక చూసింది. అపుడు మాడిసన్ తాళాలు చూపించింది.  ఏంటీ తాళాలు అనుకుంటుండగా..రోడ్డుపై పార్క్ చేసిన ఉన్న మెర్సిడెస్ బెంజ్ కారును చూపించి అదే నీకు నా బర్త్ డే గిఫ్ట్ అని చెప్పి ఆమెకు న్యూ మెర్సిడెస్‌ బెంజ్‌ సీ 300ను కానుకగా ఇచ్చి బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌ చేశారు. 

11

మెర్సిడస్‌ కారు అంటే ఆమె పీఏకు ఎంతో ఇష్టం..ఆ కారు కొనుక్కోవాలని ఎంతగానో అనుకున్నారు. కానీ అంత బడ్జెట్ లేదు. ఈ విషయం మాడిసన్ తెసుకుంది. తన పీఏ కలను నిజం చేయాలనుకుంది. 12 ఏళ్ల పాత కారుతో తన పీఏ ఇబ్బంది పడటాన్ని స్వయంగా చూసిన మాడిసన్‌ 50వేల డాలర్ల ( రూ. 30 లక్షలు) ఖరీదు చేసే గిఫ్ట్‌తో ఆమెకు సర్ ప్రైజ్ చేశారు.
22
ఆ విషయం తెలుసుకున్న ఆ పీఏ ఆనందానికి అవధుల్లేవు. ఆ షాక్‌లోంచి అంత త్వరగా బైటకు రాలేకపోయింది. ఆనందం..ఆశ్యర్చంతో తన యజమానికి కౌగలించుకుని ధన్యవాదాలు తెలిపారు.కాగా..13 ఏళ్ల వయసులోనే మాడిసన్‌కు గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  యూట్యూబ్‌ వీడియోలు 20 ఏళ్ల యువ గాయనికి తిరుగులేని బ్రేక్‌ ఇచ్చాయి. ఆమె పాటల సంచలనంగా..పాటల సునామీగా మారిపోయింది. 

Related Posts