పట్టపగలు దారుణ హత్య.. తల నరికిన దుండగులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Madurai man beheaded: తమిళనాడులో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ యువకుడిని పాశవికంగా హత్య చేసి తలను, మొండెం నుంచి వేరుచేసిందో గ్యాంగ్. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో సోమవారం జరిగింది. ఊతంగుడికి చెందిన మురుగానందం అనేవ్యక్తి (22) తన స్నెహితుడుతో కలిసి సెయింట్ మేరీస్ చర్చి వీధిలో వెళుతున్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి వారు ముందు ఆగింది.

కారులోంచి దిగిన కొందరు దుండగులు వారిని అడ్డగించారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా వారు మురుగానందంను వెంబడించి దారుణంగా హత్య చేశారు. అనంతరం తల నరికి చర్చి ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ దాడిలో గాయపడిన మురుగానందం స్నేహితుడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


హత్య? ఆత్మహత్య? విశాఖలో మృతదేహం కలకలం, నడిరోడ్డుపై మంటల్లో సజీవదహనం


ఇదంతా ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డు చేయటంతో…..ఒళ్లు గగుర్పోడిచే ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.


Related Tags :

Related Posts :