Home » పోగొట్టుకున్న 3 నెలలకు దొరికిన డబ్బు సంచీ..వృద్ధురాలి ఆనందం
Published
5 months agoon
By
nagamaniప్రయాణంలో పొరపాటున మనం పోగొట్టుకున్న వస్తువులు దొరకటం చాలా కష్టం.వాటిపై ఆశ వదులుకోవాల్సిందే. కానీ ఓ ఆర్టీసీ కండక్టర్ నిజాయితీతో ఓ వృద్ధురాలి తను పోగొట్టుకున్న సంచీ దొరికింది. కొద్దిపాటి బంగారం..డబ్బు ఉన్న సంచీని పోగొట్టుకున్న ఓ సంచీని బస్సు కండక్టర్ డిపో మేనేజర్ కు తెచ్చి ఇవ్వటంతో మేనేజర్ బుధవారం (సెప్టెంబర్ 8,2020) ఆమెకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే..మహబూబ్ నగర్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంకు చెందిన కోడి బుచ్చమ్మ అనే మహిళ జూన్ 6న మహబూబ్ నగర్ -ఇల్లెందు రూట్ లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. తరువాత తాను దిగే స్టాప్ రావటంతో తన రూ.242వేల 500లు. రెండు గ్రాముల బంగారం ఉన్న తన సంచీని మరచిపోయి బస్సు దిగిపోయింది.
ఈ బస్సు కండెక్టర్ బి.లక్ష్మణ్ ఆ సంచీని చూసారు. కానీ అదెవరిదో తెలీదు. దీంతో లక్ష్మణ్ ఆ సంచీని తీసుకుని బస్సు మహబూబ్ నగర్ డిపోకు రాగానే మేనేజర్ మహేశ్ కు అందిజేశారు. కానీ అది ఎవరిదో తెలీదు. దీంతో ఆయన సంచినీ జాగ్రత్త చేశారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదుగానీ ఇస్తే వివరాలు తెలుసుకుని ఇచ్చేద్దామని. అలా సంచీలో సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలేమన్నా ఉన్నాయోమోనని చూశారు. కానీ ఏమీ లేవు. దీంతో సదరు వ్యక్తి కోసం వెదుకుతుండగా..పది రోజుల క్రితం బుచ్చమ్మ తను ఫలానా రూట్ లో బస్సులో తన సంచీని మరచిపోయి దిగేశానని సంచీకి సంబంధించిన వివరాలన్నీ డిపో మేనేజర్ కు తెలిపింది.
దీంతో ఆ సంచీ ఆమెదేనని నిర్ధారించుకుని సెప్టెంబర్ 8న కోడి బుచ్చెమ్మకు ఆసంచీని అప్పగించారు. తాను పోగొట్టుకున్న వస్తువులన్నీ దాంట్లో భద్రంగా ఉండటంతో బుచ్చమ్మ కండక్టర్ లక్ష్మణ్ కు..డిపో మేనేజర్ కు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్బంగా మేనేజర్ కండక్టర్ నిజాయితీని అభినందించారు.