కొత్త రకం చేపను గుర్తించిన మహారాష్ట్ర సీఎం కొడుకు తేజస్ థాకరే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

tejas thackeray: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు తేజస్ థాకరే అత్యంత అరుదైన స్కిస్తురా జాతికి చెందిన కొత్త రకం చేపను కనుగొన్నారు. ఈ చేపకు ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అని పేరు పెట్టారు తేజస్. పశ్చిమ కనుమలలోని హిరణ్యాక్షి నదిలో కనిపించడంతో దీనికా పేరు పెట్టారు. పైగా హిరాణ్యాక్ష అంటే బంగారపు రంగు జుట్టు కలది అని అర్థం వస్తుంది. దీంతో బంగారపు రంగు జుట్టు కలిగినది అనే మరో అర్థం కూడా హిరణ్యాక్షికి ఉంది.ఐసీఏఆర్ ఇనిస్టిట్యూట్ పోర్టుబ్లెయిర్‌కు చెందిన జయసింహన్ ప్రవీణ్‌రాజ్, అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ కలిసి తేజస్ పశ్చిమ కనుమలలో ఈ అరుదైన చేపను గుర్తించారు.


చిన్నగా చూడముచ్చటగా ఉన్న ఈ చేపపైన బంగారపు రంగులో ఈకలు ఉన్నాయి. హిరణ్యాక్షి చేపలు ఆక్సిజన్ ఎక్కువగా ఉండే మంచినీటి చెరువులు, నదుల్లోనే కనిపిస్తుంటాయని ఈ తేజస్ టీమ్ తెలిపారు.


తేజస్ 2012లో తొలిసారి ఈ చేపను కనుగొన్నారని, 2017లో ఇదే జాతికి చెందిన మరిన్ని చేపలను కనుగొన్నట్టు ప్రవీణ్‌రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో ప్రచురితమయ్యాయి.


కాగా..శివసేన పార్టీ దివంగత నేత బాల థాకరే మనుమడు ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఉద్ధత్ థాకరే కుమారుడు అయిన తేజస్ ఠాక్రే వన్యప్రాణి పరిశోధకుడు. తేజస్ థాకరే ఫిబ్రవరి 2016 లో పశ్చిమ కనుమల్లో 5 కొత్త జాతుల మంచినీటి పీతలను కనుగొన్నారు.

Related Posts