Home » తాతకు హ్యాపీ బర్త్ డే గిఫ్ట్: హెలికాప్టర్ లో తీసుకెళ్లిన మనుమళ్లు
Published
1 month agoon
Maharashtra grandchildren Gift helicopter trip : మనుమలు ముచ్చటపడితే కొండమీద కోతిని కూడా తీసుకొచ్చి కానుకగా ఇస్తాను తాతయ్యలు. కానీ ఓ తాతకు చిరకాలంగా ఉండే కోరికను తీర్చారు ఇద్దరు మనుమలు. హెలికాప్టర్ ఎక్కాలనే తాతయ్యకోరికను ఆయన పుట్టినరోజు సందర్భంగా తీర్చిన ఆసక్తిక సన్నివేశం మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని పూణెకు చెందిన దేవరామ్ గాడ్గే, చహాబాయి గాడ్గేలు భార్యాభర్తలు. గత మంగళవారం దేవరామ్ కు 88వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మనుమలు డాక్టర్ నందకుమార్ ,గాడ్గే అడ్వకేట్ అవినాష్ గాడ్గేలు మరచిపోలేని వినూత్న గిఫ్ట్ ఇచ్చారు. తాత దేవరామ్ గోడ్గే, నానమ్మ చహాబాయిల కోసం ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని వారిని పుణే నుంచి అహ్మద్‌నగర్ జిల్లాలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు.
అంతేకాదు తాత హెలికాప్టర్ లో తమ ఊరిలో ల్యాండ్ అయ్యేసరికి ఆ గ్రామ సమీపంలోని ఓ మైదానాన్ని శుభ్రపరిచి హెచ్ అని రాసి పెట్టారు. తాతా నానమ్మల్ని మనుమలిద్దరు హెలికాప్టర్ లో తీసుకొస్తున్నారనే విషయం తెలుసుకున్న గ్రామప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో అందరు చూస్తుండగానే మంగళవారం (జనవరి 12,2021) ఉదయం ఆకాశంలో హెలికాప్టర్ శబ్దం వినిపించింది.
అందరు ఒక్కసారిగా మైదానం దగ్గరకు పరుగులుతీస్తూ వచ్చారు. ఇలా మునుపెన్నడు హెలికాప్టర్‌ను ఇంత దగ్గరగా చూడని ఆ గ్రామప్రజలు అంటున్నారు. కళ్లతో అంత దగ్గరగా హెలికాప్టర్ ని చూడలేదు. అటువంటిది తాత కోసం ఆ మనుమనుల చేయటం చాలా సంతోషమని వాళ్లు చాలా అదృష్టవంతులని అంటున్నారు గ్రామస్తులు. తాతా నానమ్మలు హెలిక్యాప్టర్ ల్యాండింగ్ అయిన ప్రాంతం నుంచి ఇంటి వరకు వారిని బ్యాండు మేళాలతో ఇంటికి తీసుకెళ్లారు మనుమలిద్దరు.
తన మనువళ్లు తనకు ఇచ్చిన ఈ అనుభూతి గురించి తాత దేవరామ్ గాడ్గే మాట్లాడుతూ..తన ఈ చివరి వయసులో తనకు జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చారంటూ మురిసిపోతూ చెప్పారు. ముఖ్యంగా డాక్టర్ నందకుమార్ పెళ్లి సమయంలో ఏనుగుపై ఊరేగింపు చేయాలని కోరడంతో ఆయన తాత ఎనుగును తీసుకొచ్చి ఊరేగించారు. ఇలా తాత ఆనందం కోసం ఆ మనువళ్లు ఏదోకటి చేస్తూనే ఉంటారు.
అదే విషయాన్ని దేవారామ్ చెబుతూ..ఈరోజుల్లో తాతా నాన్నమ్మలను ఎవరి పట్టించుకుంటున్నారు? అసలు వారు ఉన్నారనే విషయమే తెలియటంలేదు..అటువంటిది తమ కోసం ఇంత చేసే మనవళ్లు ఉన్న తాము చాలా అదృష్టవంతులనీ..ఆనందంగా చెప్పారు దేవరామ్. తాను ఎప్పుడో మాటల సందర్భంలో హెలికాప్టర్ ఎక్కాలని ఉందని చెప్పినమాటను గుర్తు ఉంచుకుని తనను నా భార్యను హెలిక్యాప్టర్‌లో తిప్పడమే గాక, తమ ఊరి వరకు తీసుకొని వచ్చారని 88 ఏళ్ల దేవరామ్ గాడ్గేతెలిపారు.
ఇలాంటి వారి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఆనంద్ మహీంద్రాకు పిచ్చకోపం తెప్పించిన ప్రయాణికుడు
తనకు లక్కీ నెంబర్ అని సన్నీలియోన్ కారు నెంబర్ వేయించుకున్న వ్యాపారి
అంత్యక్రియల తర్వాత బూడిదను చోరీ చేసే ప్రయత్నం, కారణం తెలిస్తే అయ్యో పాపం అనాల్సిందే
భారత్‌లో కోరలు చాస్తోన్న కరోనా..24 గంటల్లో 16,738 కొత్త కేసులు
కరోనా కలకలం.. ఒకే స్కూల్లో 229మంది విద్యార్థులకు పాజిటివ్
నగర గోడలపై ట్రాన్స్ జెండర్ల పెయింటింగ్..సూపర్ అంటున్న జనాలు