లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

లక్ష రూపాయల కోసం స్వంత కిడ్నాప్ డ్రామా

Published

on

Man arrested for Own kidnapping : ముంబై లోని అంధేరి ప్రాంతంలో నివసించే జితేంద్ర కుమార్ యాదవ్(30) ని గుర్తు తెలియని కిడ్నాపర్లు బుధవారం, అక్టోబర్21న కిడ్నాప్ చేసారు. అతడ్ని ఒక కుర్చీలో తాళ్లతో కట్టేసారు. ప్రాణాలతో విడిచి పెట్టాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒక వీడియోను రూపోందించి దాన్ని ఉత్తర ప్రదేశ్ లో ఉన్న అతని భార్య, బావమరిదికి పంపించారు.

వీడియో చూసిన అతని బావమరిది సుశికుమార్ కిడ్నాపర్లు ఇచ్చిన బ్యాంకు ఎకౌంట్ లో డబ్బు జమ చేశాడు. బ్యాంకు లో డబ్బు జమ చేసిన రశీదు ను కిడ్నాపర్లకు పంపించిన తర్వాత, సుశికుమార్ ఓషివారా పోలీసు స్టేషన్ లో కిడ్నాప్ అంశంపై ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ తూషార్ సావంత్ నేతృత్వంలోని బృందం కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టింది. గురువారం ఉదయం ఓషివారాలోని తారాపోరేవాలా గార్డెన్ సమీపంలో ఆగి ఉన్న కారులో జితేంద్రకుమార్ ను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ దసరా వెరీ స్పెషల్ : దుర్గామాత స్థానంలో ‘‘వలస కూలీ తల్లి’’ విగ్రహాలు


అక్కడి నుంచి జితేంద్ర కుమార్ ను క్షేమంగా పోలీసు స్టేషన్ కి తీసుకువచ్చి… కిడ్నాపర్ల గురించి ఆరా తీశారు. జితేంద్ర కుమార్ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ గురయ్యారు. స్నేహితుడు ద్వారా తానే స్వంతంగా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు వెల్లడించాడు.జితేంద్ర కుమార్ తన స్వంత అవసరాల కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనపడక తన స్నేహితుడు ఇంద్రకుమార్ యాదవ్ సాయంతో కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఇంద్రకుమార్  జితేంద్రకుమార్ ను కుర్చీలో కట్టేసి, సెల్ ఫోన్ లో వీడియో తీసి ఆ వీడియోను జితేంద్ర భార్యకు, బావ మరిదికి పంపించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కిడ్నాప్ డ్రామాకు సహకరించిన ఇంద్రకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ సెక్షన్ 364 ఎ (విమోచన కోసం కిడ్నాప్), సెక్షన్ 387 (వ్యక్తిని మరణానికి భయపడటం లేదా తీవ్రమైన బాధతో ఉంచడం, దోపిడీకి పాల్పడటం), 385 (దోపిడీకి పాల్పడటానికి వ్యక్తిని గాయానికి గురిచేయడం) కింద కేసు నమోదు చేశారు.ఇవికాక ఐపీసీ సెక్షన్  201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలు అదృశ్యం కావడం, లేదా స్క్రీన్ అపరాధికి తప్పుడు సమాచారం ఇవ్వడం), మరియు 182 (తప్పుడు సమాచారం, ప్రభుత్వ ఉద్యోగి తన చట్టబద్ధమైన అధికారాన్ని మరొక వ్యక్తి గాయానికి ఉపయోగించుకునే ఉద్దేశంతో).ల కింద కూడా కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *