వీడియో కాల్స్ తో మహిళకు వేధింపులు…..నగ్నంగా కనిపించిన వ్యక్తిని చూసి షాక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయేమో అనిపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అకతాయిలు అకతాయిల వేధింపులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో ఇది మరింత పెరిగింది. మహారాష్ట్రలో ఒక వ్యక్తి మహిళకు వీడియోకాల్ చేసి నగ్న ప్రదర్శన చేశాడు. హడలిపోయిన బాధితురాలు భర్త సహయంతో పోలీసుస్టేషన్ లో కేసునమోదు చేసింది

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వాలూజ్ గ్రామానికి చెందిన మహిళకు ఫోన్ కు గత కొద్ది రోజులుగా ఆమెకు తెలియని నెంబరు నుంచి మెసేజ్ లు వస్తున్నాయి. ఆమె వాటి గురించి పట్టించుకోక పోవటంతో అసభ్యకరమైన వీడియోలుకూడా పంపటం మొదలుపెట్టాడు అపరిచిత వ్యక్తి. ఈ విషయం చెప్పుకుంటే ఎక్కడ అల్లరవుతామోనని ఆ మహిళ వాటికి రిప్లయ్ ఇవ్వకుండా, విషయం బయట పెట్టకుండా మౌనంగా భరిస్తూ వచ్చింది.ఈ క్రమంలో ఇటీవల మరోక నెంబరు నుంచి ఆమె వాట్సప్ కు వీడియోకాల్ వచ్చింది. ఎవరా అని ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా ఉన్నట్టుండి ఆ అపరిచిత వ్యక్తి నగ్నంగా మారి ఆమెకు దర్శనమిచ్చాడు. ఒంటిపై నూలు పోగులేకుండా వీడియో కాల్ లో అపరిచిత వ్యక్తి అంగాంగం ప్రదర్శన చేసేసరికి ఆమహిళ షాక్ కు గురైంది.ఇక అవతలి వారి ఆగడాలను భరించలేని మహిళ భర్త సహాయంతో గురువారం సెప్టెంబర్10 వతేదీన వాలుజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికివచ్చిన ఫోన్ నెంబరు ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వాలూజ్ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పండిట్ చెప్పారు.

Related Posts