లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

మంత్రి వివరణ : నేను అత్యాచారం చేయలేదు..మేం రిలేషన్‌లో ఉన్నాం..డబ్బుల కోసమే బ్లాక్ మెయిల్

Published

on

Maharashtra Minister rape molestation charge : మహారాష్ట్ర మహారాష్ట్ర సోషల్‌ అండ్‌ జస్టిస్‌ మంత్రి ధనంజయ్‌ ముండేపై 38 మహిళ అత్యాచార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మంత్రి ధనంజయ్‌ స్పందించారు. తాను ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డానంటూ అందరూ ఆరోపిస్తున్నారని అయితే.. తాను అత్యాచారం చేయలేదని..సదరు మహిళఆ నేను రిలేషన్ లో ఉన్నామని వివరణ ఇచ్చారు. తాను సదరు మహిళతో 2003 నుంచి రిలేషన్ లోనే ఉన్నామని..అంతేగానీ తాను అత్యాచారం చేసానని అనే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ధనుంజయ్ తెలిపారు.

మంత్రిని బావగా పేర్కొన్న ఆ 38 ఏళ్ల మహిళ తనను పెళ్లి చేసుకుంటానని, బాలీవుడ్ లో అవకాశాలు ఇప్పిస్తానని …నమ్మించి 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ముంబై పోలీసులకు 38 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. కాగా మహిళతోపాటు ఆమె సోదరి ఇద్దరూ కలిసి తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధనంజయ్ తెలిపారు. వీరిద్దరి మీద తాను గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని ఈ సందర్భంగా మంత్రి ధనుంజర్ స్పష్టంచేశారు.

తనపై ఆరోపణలు చేసిన మహిళ సోదరితో తనకు 2003 నుంచి సంబంధం ఉందని.. ఈ సంబంధానికి రుజువుగా తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ధనుంజయ్‌ ముండే తెలిపారు. తమకు ఉండే ఈ సంబంధం గురించి ఈ మధ్య కుటుంబ సభ్యులకు చెప్పాననీ దానికి వాళ్లు కూడా అంగీకరించారని..అంతా బాగుంది..ఇక భార్యా భర్తలుగా జీవించాలని అనుకునే ఈ సమయంలో తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇతి ఎంత మాత్రం సరైంది కాదనీ ఆమెను నేను మోసం చేద్దామని ఆలోచనలేదని వివరించారు మంత్రి.
కాగా..మంత్రి సదరు మహిళతో సంబంధం ఉందని అంగీకరించినా మంత్రి వర్గం నుంచి ధనుంజయ్ ను తొలగించాలని మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు.

కాగా..సదరు మహిళా మంత్రి ధనుంజయ్ ముండేపై చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి..2008లో ముండే తొలిసారి నాపై అత్యాచారం చేసి దాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ తనపై కొన్ని సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. 2019లో ఆమె తనను వివాహం చేసుకోవాల్సిందిగా ధనుంజయ్ ను అడిగింది. కానీ ధనుంజయ్‌ ఒప్పుకోలేదు.

అంతేకాకుండా..దీని గురించి ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దాంతో అతడి మీద ఫిర్యాదు చేశాం. కానీ పోలీసులు ధనుంజయ్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయలేదని వాపోయిందామె. దీనిపై సదరు మహిళ తరపు లాయర్ రమేష్ త్రిపాఠీ మాట్లాడుతూ..మంత్రి ధనుంజయ్ ముండే వల్ల నా క్లైంట్ కు ప్రాణహాని ఉందనీ..ఇక బాధితురాలికి ఏమైనా జరిగితే అందుకు ధనుంజయ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *