maharashtra politics  all eyes on 13 independents, 16 smaller party MLAs

బీజేపీ టార్గెట్ 180 : అందరి చూపు వారి వైపే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ  ఉత్కంఠను రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాత్రికి రాత్రి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ-అజిత్ పవార్ మద్దతుదారులతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించి సంఖ్యా బలం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

288మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ 21వ తేదీన ఎన్నికలు జరిగాయి. మూడు రోజుల వ్యవధిలో  24వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ 145. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కి 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ సాధించడానికి బీజేపీ అన్ని దారులు వెతుకుతోంది. 170 నుంచి 180మంది ఎమ్మెల్యేల మద్దతు లక్ష్యంగా పెట్టుకుంది. తమకు 170 నుంచి 180 ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందని.. విశ్వాసపరీక్ష సులభంగా పాస్ అవుతామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇప్పుడు అందరి కళ్ళు 13 మంది ఇండిపెండెంట్లు 16 మంది చిన్న చిన్న  రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలపై ఉంది.

ఇంతకు ముందే  శివసేనకు మద్దతు లేఖ ఇచ్చిన అచల్ పూర్ ఎమ్మెల్యే,  ప్రహార్ జనశక్తి పార్టీ (పిజెపి) చీఫ్ బచుకడు తాను, తన ఇద్దరు శాసనసభ్యులు కూడా శివసేనకు మద్దుతు కొనసాగిస్తామని చెప్పారు. క్రాంతికారి శెట్కారి పక్ష్ (కెఎస్పి) ఎమ్మెల్యే శంకరరావు గడఖ్ కూడా సేనకు మద్దతు లేఖ ఇచ్చారు. ఆశిష్ జైస్వాల్ (రామ్‌టెక్), నరేంద్రభోండేకర్ (భాంద్రా), మనీలా గవిత్ (సక్రీ), చంద్రకాంత్ పాటిల్ (ముక్తేనగర్) ల  మద్దతును కూడా  శివసేన పొందగలిగింది.

ఇక బీజేపీకి మద్దతు ఇస్తున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల విషయానికి వస్తే….రవి రానా (బద్నేరా), కిషోర్ జోర్గేవార్ (చంద్రపూర్), గీతా జైన్ (మీరా భయాందర్) మహేష్ బల్ది (యురాన్), సంజయ్ షిండే (కర్మల), రాజేంద్ర రౌత్ (బర్షి), పకాష్ అవడే (ఇచల్కరంజీ), రాజేంద్ర పాటిల్ (శిరోల్), లతో పాటు పిడబ్ల్యుపి ఎమ్మెల్యే శ్యామ్‌సుందర్ షిండే (లోహా), రాష్ట్రీయ సమాజ్ పక్ష్ కు చెందిన రత్నాకర్ గుట్టే(గంగఖేడ్), భోయిసార్ నుంచి గెలుపొందిన రాజేష్ పాటిల్, క్షతీజ్ ఠాకూర్(నల్స్ పోరా) వాసాయి నుండి  గెలిచిన హితేంద్ర ఠాకూర్, మరియు బహుజన్ వికాస్ అగాడి (బివిఎ) నుంచి గెలుపొందిన అందరు ఎమ్మెల్యేలు, మరియు జన సూరజ్య శక్తి పార్టీకి చెందిన  ఎమ్మెల్యే వినాయక్ కోరే(షాహువాడి) మద్దతు కూడా బీజేపీ కు ఉన్నట్లు  చెపుతోంది.

వీరు కాక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలతో AIMIM పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు, మరియు ఒక ఎమ్మెల్యేతో సిపిఎం, ఎంఎన్ఎస్, ఆర్ఎస్పి మరియు స్వాభిమాని పక్ష్ పార్టీలు ఉన్నాయి. మరోవైపు … ఫడ్నవీస్ సర్కార్‌ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సోమవారం ఉదయం 10.30కు విచారణ జరపనున్న కోర్టు… ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన లేఖతోపాటు… బీజేపీ సంఖ్యా బలం లేఖను పరిశీలించనుంది. ఆ తర్వాత బలపరీక్షపై నిర్ణయం తీసుకోనుంది. దీంతో మహారాష్ట్రలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.

Related Posts