Maharashtra : Pune Man creates ruckus at hospital after daughter''s birth

కొడుకుని కనమంటే కూతుర్ని కంటావా? భార్యను చంపేస్తానంటూ ఆస్పత్రి పై దాడి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తనకు ఆడబిడ్డ పుట్టిందని భార్యపై అ గ్గిమీద గుగ్గింలా మండిపడ్డాడు భర్త. మగపిల్లాడిని కనమంటే ఆడపిల్ల దరిద్రాన్నికంటావా? అంటూ
నీ అంతు చూస్తానంటూ భార్యపై ఎగిరిపడ్డాడు ఓ శాడిస్టు భర్త. భార్యను చంపేస్తానంటూ ఆస్పత్రి ల్లోకి దూసుకొచ్చాడు.
దీంతో ఆస్పత్రి సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. వారిమీద కూడా దాడికి దిగి వారిని గాయపరిచాడు. దీంతో హాస్పిటల్ సిబ్బంది అతన్నిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఉన్మాదపు భర్తను అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పూణేలోని బారామతి పట్టణంలోని డోర్లేవాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే..పూణేకు చెందిన కృష్ణ కాలే భార్య జూన్‌ 25న బరామతి డోర్లేవాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడపిల్ల జన్మించ్చింది. ఆడపిల్ల పుట్టిందని తెలిసిన కాలే మండిపడ్డాడు. బాగా మద్యం తాగాడు. అలా మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చి నీరసంగా మత్తులో పడి ఉన్న భార్యను చంపుతానంటూ వీరంగం ఆడాడు.

అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆసుపత్రి సిబ్బందిపై రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కొడుకును కనమంటే కూతుర్ని కంటావా? ఈ దరిద్రాన్ని నేను పెంచను.. అంటూ భార్యను ఇష్టమొచ్చినట్లుగా బండ బూతులు తిట్టాడు. ఆస్పత్రి సిబ్బంది బాలు చవాన్ అతన్ని ఆపటానికి యత్నించగా అతని తలపై పెద్ద రాయితో కొట్టాడు.

దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే బరామతి పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నఅతడ్నీ అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై తి సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆడుంబర్ పాటిల్ మాట్లాడుతూ..దాడికి పాల్పడిన కృష్ణ కాలేను అదుపులోకి తీసుకున్నామనీ..అతనిపై ఐపిసి సెక్షన్లు 353 (తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి ఒక ప్రభుత్వ సేవకుడిపై దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం), 333 (తన విధిని నిర్వర్తించడంలో ఒక ప్రభుత్వ సేవకుడికి స్వచ్ఛందంగా తీవ్ర హాని కలిగించడం), 504 (50) ( శాంతిని ఉల్లంఘించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

Read:అమ్మకోసం..వట్టిచేతులతో బావి తవ్విన యువతి: లేడీ భగీరథ

Related Posts