-
Home » కష్టే ఫలి : గాజులు అమ్మిన యువకుడు IAS అయ్యాడు
National
కష్టే ఫలి : గాజులు అమ్మిన యువకుడు IAS అయ్యాడు
Published
1 month agoon

Maharashtra : bangle seller Ramesh gholap to an IAS : కష్టాలు కొందరిని కృంగదీస్తే..మరికొందరిని రాటుతేలేలా చేస్తాయి. అటువంటి ఓ యువకుడు కన్నతల్లిని పుట్టి పెరిగిన గ్రామాన్ని తలెత్తుకునేలా చేశాడు. ఒకప్పుడు పొట్టకూటి కోసం గాజులు అమ్మిన యువకుడు నేడు IAS అయ్యాడు. అతని పేరు రమేష్ గోలప్. కష్టాలు ఎన్ని ఎదురొచ్చినా ఏమాత్రం భయపడలేదు. బాధపడలేదు. వాటినొక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. IAS అయ్యాడు.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వార్సీకి చెందిన రమేష్ గోలప్ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. దీంతో ఆటపాటల్లో పాల్గొనడానికి ఇబ్బంది పడేవాడు. కానీ..తనకున్న వైకల్యాన్ని చూసి ఏనాడు కృంగిపోలేదు. ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం చెదరనివ్వలేదు. చదువులో రాణించేవాడు. ఎప్పుడూ క్లాస్ ఫస్టే.
రమేష్ తండ్రి గోరఖ్ గోలప్ సైకిల్ షాపు నిర్వహిస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కానీ తండ్రి తాగుడు అలవాటు. కుటుంబం నడవటం కష్టమైనా తాడుగు మానేవాడు కాదు గోరఖ్. ఆ అలవాటుతోనే ఆరోగ్యం దెబ్బతింది. ఆదాయం లేకపోయేసరికి రమేష్ తల్లి విమల చుట్టుపక్కల గ్రామాల్లో వీధి వీధి తిరుగుతూ గాజులు అమ్మేది. ఆ కొద్దిపాటి డబ్బులతో సంసారాన్ని నెట్టుకొచ్చేది. తల్లికి రమేష్ గోలప్ అతని తమ్ముడు చేదోడు వాదోడుగా ఉండేవారు.
ఓపక్క చదువు..మరోపక్క గాజులు అమ్మటంలో తల్లికి సహాయం చేసే రమేష్ కష్టపడేవాడు. పైగా వారి గ్రామం మహగాన్లో ప్రాథమిక పాఠశాల వరకే ఉండటంతో ఉన్నత విద్య కోసం బాబాయి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది రమేష్. ఎక్కడకెళ్లినా రమేష్ చదువులో ఫస్టే. అలాకష్టాల్లోనే సాగుతున్న రమేష్ కుటుంబానికి మరో దెబ్బ 2005లో అనారోగ్యంతో తండ్రి మరణించాడు. దీంతో ఇంటర్ చదివే రమేష్ షాక్ కు గురయ్యాడు. సరిగ్గా అదే సమయంలో మోడల్ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి అంత్య క్రియలకు వెళ్లటానికి చేతిలో ఒక్కరూపాయి కూడా లేదు. ఊరు వెళ్లాలంటే బస్ చార్జీ కోసమైనా 7 రూపాయలు కావాలి. కానీ అవికూడా రమేష్ దగ్గర లేవు. కానీ రమేష్ వికలాంగుడు కావటంతో బస్‌పాస్ ఉంది. అయినా సరే మరో 2 రూపాయలు కావాలి. స్నేహితుల సహాయంతో తండ్రి అంత్య క్రియల్లో పాల్గొన్నాడు.
ఎంత తాగుబోతు అయినా తండ్రి మరణం రమేష్ ను బాగా కుంగదీసింది. కానీ..తల్లి ధైర్యం చెప్పింది. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువుమాత్రం మానొద్దని హితబోధ చేసింది. అలా తల్లి బలవంతంతో నాలుగు రోజులకు కెమెస్ట్రీ పరీక్షకు హాజరయ్యాడు. ఆ పరీక్షలో రమేష్‌కు 40కి 35 మార్కులొచ్చాయి. దీంతో స్కూల్ టీచర్ ఇచ్చి ప్రోత్సాహంతో ఇంటర్ లో 88.5 శాతం మార్కులు సాధించాడు. ఉన్నత చదువులు చదవాలని రమేష్ కోరిక. చదువుతోనే తమ కష్టాలు తీరుతాయని నమ్మిన రమేష్ కు చదువుమీదనే ధ్యాస. కానీ ఉన్నత చదువులు చదవాలంటే తనకు సాధ్యం కాదని తెలుసు. అందుకే..తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డీఎడ్ కోర్సులో చేరాడు.
అదే సమయంలో ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశాడు. అలా 2009లో ఓ స్కూల్లో టీచర్‌గా జాయినయ్యాడు. తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ ఆ ఉద్యోగం రమేష్ కు సంతృప్తినివ్వలేదు. ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే గానీ..ఇంకా చదువుకోవాలనే కోరిక మాత్రం విడిచిపెట్టలేదు రమేష్ ని. కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు స్టూడెంట్ యూనియన్ లీడర్ హోదాలో రమేష్ చాలా సార్లు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లేవాడు. అలా తరచూ తహసీల్దార్‌ని కలిసినప్పుడల్లా తాను కూడా అలా అయితే బాగుండు అనుకునేవాడు. అలా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు.
2009లో స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పూనె వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వటం ప్రారంభించాడు. కానీ ఫస్టు ఎటెమ్ట్ లో ఫెయిల్ అయ్యాడు. కానీ పట్టుదల విడిచిపెట్టలేదు. మరోసారి యత్నించాడు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. అక్కడితో రమేష్ సరిపోట్టుకోలేదు. రాత్రి పగలు కష్టపడి చదివి..2012 యూపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో 287వ ర్యాంకు సాధించాడు. IAS అయ్యాడు. ఆ క్షణంలో రమేష్ ఆనందం అంతా ఇంతా కాదు. అలా 2012 మే 4న IAS అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టాడు.
తమ కళ్లముందే గాజులమ్మిన కుర్రాడు ఐఏఎస్ ఆఫీసర్‌గా రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రమేష్‌కు ఘనంగా స్వాగతం పలికారు. బ్రహ్మరథం పట్టాడు. ఎత్తుకుని ఆనందంగా తిప్పారు. పూల మాలలో సత్కరించారు. యువకులకునీలాంటివారు ఆదర్శం అని కొనియాడారు.
అలా గాజులమ్మే రమేష్ జార్ఖండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. డ్యూటీలో ఏమాత్రం రాజీ పడని రమేష్ అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ స్థాయికి వచ్చినా రమేష్ తన బాల్యంలో పడిని కష్టాల్ని మరచిపోలేదు.కష్టంలో ఉన్నవారికి తానున్నాననే ధైర్యాన్నిస్తున్నాడు. ఆ కష్టాల అనుభవాలను ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటాడు. అందుకే అవినీతికి పాల్పడే అధికారుల పాలిట సింహస్వప్నంగా మారాడు. అవినీతి చేయడు..చేయనివ్వడనే పేరు తెచ్చుకున్నాడు.
You may like
-
ఇలాంటి వారి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఆనంద్ మహీంద్రాకు పిచ్చకోపం తెప్పించిన ప్రయాణికుడు
-
తనకు లక్కీ నెంబర్ అని సన్నీలియోన్ కారు నెంబర్ వేయించుకున్న వ్యాపారి
-
అంత్యక్రియల తర్వాత బూడిదను చోరీ చేసే ప్రయత్నం, కారణం తెలిస్తే అయ్యో పాపం అనాల్సిందే
-
టీ పెట్టలేదని భార్యను కొడితే ఊరుకోం..ఆమె మీ సొంత ఆస్తికాదు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
భారత్‌లో కోరలు చాస్తోన్న కరోనా..24 గంటల్లో 16,738 కొత్త కేసులు
-
కరోనా కలకలం.. ఒకే స్కూల్లో 229మంది విద్యార్థులకు పాజిటివ్

ప్రశాంత్ కిశోర్‌కు కేబినెట్ హోదా.. రూపాయే జీతం!

మీరు ఇలాంటి పొరపాటు చేయొద్దు… బిస్కట్ అనుకుని ఎలుకల మందు తిన్న ఐదేళ్ల చిన్నారి మృతి

ఆవు పేడ రక్షణకు సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది.. అధికారుల కీలక నిర్ణయం

స్కూల్ కెళ్లి చదువుకోమన్నారని బాలుడు ఆత్మహత్య
