Home » పిల్లల కోసం పూణెలో పోలీస్ స్టేషన్.. తొలిసారి
Published
2 months agoon
By
MaheshPolice Station: తొలిసారి పిల్లల కోసం పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు మహారాష్ట్రలోని పూణె పోలీసులు. సోమవారం లష్కర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాల్స్నేహీ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. దీనికి తగ్గట్లుగానే పోలీస్ స్టేషన్ పరిసరాలను కూడా మార్పు చేశారు. అక్కడకు వచ్చి పిల్లలు కంప్లైంట్ చేసేందుకు అనుగుణంగా రూం తీర్చిదిద్దారు.
దీనిని కాన్పూర్ ఐఐటీ డైరక్టర్ అభయ్ కరాందికర్, పూణె పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా, జాయింట్ కమిషనర్ రవీంద్ర శిసావె, హోప్ ఫర్ చిల్డ్రన్ ఫౌండేషన్ సీఈఓ, కెరోలిన్ ఆడీర్ డె వాల్టెర్ లు ఆరంభించారు.
దీని ఏర్పాటు లక్ష్యం పిల్లల్లో భయం పోయి స్వేచ్ఛపూరితమైన వాతావరణం కల్పించాలని. ఆ ఫీలింగ్ పోవడం కారణంగా నేరాలకు పాల్పడే పిల్లల క్రిమినల్ ఆలోచనలు వారి నుంచి దూరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సివిల్ సొసైటీలోని ఇతర సభ్యులు.. పోలీస్ పర్సనల్స్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా ఇది చాలా మంచి విషయమని కొనియాడారు. ప్రయోగాత్మకంగా ఈ పిల్లల పోలీస్ స్టేషన్ మొదలుపెట్టామని ఆయన అన్నారు. ఉపయోగకరంగా అనిపిస్తే భవిష్యత్ లో మరిన్ని పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆయన అన్నారు.
చీఫ్ గెస్ట్ కరాందికర్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాం. ఈ విషయం చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచించింది. జువైనల్ జస్టిస్ అనేది పిల్లలకు సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సాయం చేయడానికి పోలీసులు ముందు ఉండాల్సిందే. కేవలం పోలీసులు ఒక్కరే అన్నీ చేయాలంటే కుదరని పని. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలి. అని ఆయన వెల్లడించారు.