పోలీసు చెంప ఛెళ్లుమనిపించిన మహిళా మంత్రికి 3 నెలల జైలుశిక్ష

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Maharashtra women minister 3 mounths jail : డ్యూటీ ఉన్న పోలీసు మీద చేయి చేసుకున్న ఓ మహిళా మంత్రికి ధర్మాసనం మూడు నెలల జైలుశిక్ష విధించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. జైలుశిక్షతో పాటు రూ.15 వేల 500 జరిమానా కూడా విధించింది.


మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖామంత్రి యశోమతి ఠాకూర్‌కు అమరావతి కోర్టు మూడు నెలల జైలుశిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా కూడా విధించింది. ఆమెతో పాటు ఆమె డ్రైవర్ తో సహా మరో ముగ్గురుని కూడా దోషులుగా నిర్ధారించిన కోర్టు వారి కూడా మూడు నెలల జైలుశిక్ష విధించింది.


ఎనిమిదేళ్ల క్రితం అంటే 2012 మార్చి 24 సాయంత్రం 4.15 గంటల సమయంలో అమరావతి జిల్లాలోని రాజపేత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చునభట్టి ప్రాంతంలో యశోమతి ఠాకూర్ అంబాదేవి ఆలయం సమీపంలో ఉల్హాస్ రౌరాలే అనే పోలీసు మీద చేయి చేసుకున్నారు.


ఆ సమయంలో ఆమె కారు డ్రైవర్, మరో ఇద్దరు మద్దతుదారులు కూడా ఆ పోలీసు మీద విరుచుకుపడ్డారు. దీంతో బాధిత పోలీసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమరావతి పోలీసులు మంత్రి యశోమతిపై కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మంత్రితో పాటు మిగతా వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ మేరకు 3 నెలల జైలుశిక్ష, రూ.15 వేల500 జరిమానా విధించింది.


ఈ తీర్పుపై ఆమె స్పందిస్తూ..నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఈ తీర్పు 8 సంవత్సరాల తరువాత వచ్చింది. కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు అప్పీల్ చేస్తాను. బీజేపీతో సైద్ధాంతికంగా పోరాటం చేస్తున్నాను.


బీజేపీ నాయకులు నా కెరీర్‌ను అణగదొక్కాలని అనుకుంటున్నారు. అందుకే నేను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తురని మంత్రి యశోమతి ఠాకూర్‌ మీడియాకు తెలిపారు. కాగా, మహారాష్ట్రలోని తేవ్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యశోమతి ఠాకూర్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె అమరావతి జిల్లా సంరక్షక మంత్రిగా కూడా ఉన్నారు.

Related Tags :

Related Posts :