గాంధీ పాకెట్ గడియారం @ 11.82 లక్షలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mahatma Gandhi’s alarm-pocket- watch : మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారానికి భారీ రెస్పాండ్ వచ్చింది. బ్రిటన్ లో జరిగిన ఓ వేలం పాటలో 11 లక్షల 82 వేల 375 రూపాయలు (12 వేల పౌండ్లు) అమ్ముడుపోయింది. ఈ గడియారం కాస్త పగిలిపోయినా..ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపాడు. ఈస్ట్ బ్రిస్టల్ లో శుక్రవారం ఈ వాచిపై వేలం పాట నిర్వహించారు.పది వేల పౌండ్లు అంటే..9 లక్షల వరకు వస్తుందని అంచనా వేశారు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువే ధర పలికింది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి దీనిని దక్కించుకున్నారని వేలం వేసిన అండ్రూ స్టో చెప్పారు. ఆగస్టులో గాంధీ కళ్లద్దాలు వేలం వేసిన తర్వాత..ఆయనకు సంబంధించిన వస్తువుల వేలంపై ఎన్నో అభ్యర్థులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఈ వాచీకి ఊహించని విధంగా ధర వచ్చిందన్నారు.ఇక గాంధీ వాడిన పాకెట్ గడియారం విషయానికి వస్తే..మోహన్ లాల్ శర్మ గాంధీ వద్దకు వెళ్లి స్వచ్చందంగా సేవలందించారు. ఆయన చూపిన ప్రేమకు కృతజ్ఞతగా..ఈ పాకెట్ గడియారాన్ని 1944లో గాంధీ ఇచ్చారు. 1975లో ఆ గడియారాన్ని తన మనువడికి ఇచ్చారు. ఈ గడియారాన్ని గాంధీ చాలా రోజులు వాడి..ఓ నమ్మకమైన స్నేహితుడికి ఇవ్వడం..చాలా జాగ్రత్తగా దాచుకోవడం అద్బుతమన్నారు స్టో.

Related Tags :

Related Posts :