‘ఆకాశం నీ హద్దురా’ కు మహేష్ ప్రశంసలు.. సూర్య ఏమన్నాడంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Aakasam Nee Haddura: విలక్షణ నటుడు సూర్య, అపర్ణ బాలమురళి జంటగా.. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ‘సింప్లి ఫ్లై’ ఆధారంగా తెరకెక్కిన Soorarai Pottru..‘ఆకాశం నీ హద్దురా’ ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది.


సూర్య, అపర్ణల నటన, దర్శకురాలు సుధ కొంగర టేకింగ్‌కి సినీ ప్రముఖుల నుండి కూడా మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు.


మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్! ‘ఆహా’ అంటున్న ఫ్యాన్స్..


‘‘సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) స్ఫూర్తిదాయకమైన చిత్రం. బ్రిలియంట్‌ డైరెక్షన్‌, అద్భుతమైన పెర్ఫామెన్స్‌, సూర్య టాప్‌ రేంజ్‌లో నటించాడు. ఎంటైర్ టీంకు అభినందనలు’’ అంటూ మహేష్ ట్వీట్ చేయగా.. సూర్య తన స్పందన తెలియజేశారు. ‘‘మా సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేష్ కు ధన్యవాదాలు. ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ
సూర్య బదులిచ్చారు.

Related Tags :

Related Posts :