లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

వన్ వర్డ్.. ‘ఉప్పెన’ క్లాసిక్.. సూపర్‌స్టార్ మహేష్..

Updated On - 1:41 pm, Tue, 23 February 21

Mahesh Babu: ‘ఉప్పెన’.. ఏ నోట విన్నా ఈ సినిమా గురించే టాపిక్.. ఎక్కడ విన్నా ఈ సినిమా పాటలే.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా, బుచ్చిబాబు సానా దర్శకుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ విలువలు, సాయి చంద్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారందరూ..

Uppena

సామాన్యుల నుండే కాదు సినీ ప్రముఖుల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు, చిత్ర బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి గొప్పగా చెప్పడమే కాక, డీఎస్పీ, సుకుమార్‌లకు ప్రత్యేకంగా ఆశీస్సులందజేశారు.

Uppena

నటసింహా నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ‘ఉప్పెన’ ప్రత్యేక ప్రదర్శన చూసి, నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందించారు. ఇక తాజాగా ఈ సినిమా చూశారు సూపర్‌స్టార్ మహేష్ బాబు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఉప్పెన’ క్లాసిక్ అని కొనియాడారాయన.. సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా మూవీ టీంకి విషెస్ తెలిపారు మహేష్..