Mahesh Babu daughter Sitara Ghattamaneni to do voice over for young Elsa in the dubbed Telugu version of Frozen 2

‘ఎల్సా’ పాత్రకు సితార పాప వాయిస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

డిస్నీ సంస్థ నిర్మించిన ‘ఫ్రోజెన్ 2’ మూవీ తెలుగు వెర్షన్ కోసం ‘అన్నా’ పాత్రకు మహేశ్ బాబు కూతురు సితార పాప వాయిస్ చెప్పనుంది..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార సరికొత్త అవతారంలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. 2013లో వచ్చిన పాపులర్ యానిమేటెడ్ మూవీ ‘ఫ్రోజెన్’కు సీక్వెల్‌గా.. దాదాపు అదే టీమ్‌తో డిస్నీ సంస్థ ‘ఫ్రోజెన్ 2’ చిత్రాన్ని నిర్మించింది. క్రిస్ బక్ అండ్ జెన్నిఫర్ లీ డైరెక్ట్ చేశారు.  

ఈ సినిమాలో ‘ఇదియా మెజెల్’ పోషించిన ‘ఎల్సా’, ‘క్రిస్టెన్ బెల్’ చేసిన ‘అన్నా’ మెయిన్ క్యారెక్టర్స్.. ఈ పాత్రలకు హిందీలో చోప్రా సిస్టర్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘ఎల్సా’ పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెబుతుండగా.. ‘అన్నా’ పాత్రకు మహేశ్ కూతురు సితార పాప వాయిస్ చెప్పనుంది.

Read Also : ఫ్రెండ్ కోసం ర్యాప్ పాడిన రానా

ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాలోని పాపులర్‌ సాంగ్ ‘లెట్ ఇట్ గో’ కు క్రిస్టిన్ అండర్సన్-లోపెజ్, రాబర్ట్ లోపెజ్‌లకు ఉత్తమ మ్యూజిక్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. ‘ఫ్రోజెన్ 2’ నవంబర్ 22న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది..  

Related Posts