Mahesh Babu Fan made Poster gone viral

రాముడిగా సూపర్‌స్టార్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సూపర్‌స్టార్ మహేష్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

సూపర్‌స్టార్ మహేష్ బాబు రాముడి గెటప్‌లో కనిపిస్తున్న పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తర్వాతి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తమ హీరో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకోనున్నాడని మహేష్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

అలాగేమహేష్‌తో రాజమౌళి సినిమా ఏ జోనర్‌లో ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు స్వయంగా తమ క్రియేటివిటీకి పదును పెడుతూ పోస్టర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ రాజమౌళి కనుక ‘రామాయణం’ సినిమా చేస్తే రాముడి గెటప్‌లో మహేష్ ఎలా ఉంటాడోనని ఊహిస్తూ ఒక అభిమాని పోస్టర్‌ను రూపొందించాడు. ఆ పోస్టర్‌లో రాముడి గెటప్‌లో మహేష్ అద్భుతంగా ఉన్నాడు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తోటి అభిమానులు ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తున్నారు.

Read: పెళ్లి పేరుతో మోసం చేశాడు.. సాయి సుధ ఫిర్యాదు.. పోలీసు కస్టడీలో శ్యామ్ కె నాయుడు..

Related Posts