లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మహేష్ విడుదల చేసిన ‘మేజర్’ లుక్ టెస్ట్

Published

on

Major – ‘The Look’ Test: అడివి శేష్ హీరోగా, ‘గూఢ‌చారి’ ఫేం శ‌శి కిర‌ణ టిక్కా ద‌ర్శ‌కత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న మూవీ ‘మేజ‌ర్‌’. శోభితా ధూళిపాళ్ల కథానాయిక.


26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిలటరీ అధికారిగా కనిపించడానికి అడవి శేష్ కఠినమైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాడు.Majorఈ సినిమాకు సంబంధించిన ‘లుక్ టెస్ట్’ వీడియోను మహేష్ బాబు విడుదల చేశారు. ‘మేజర్’ సినిమా గురించి, సందీప్ ఉన్నికృష్ణన్ తనను ప్రభావితం చేసిన విధానం గురించి, ఈ వీడియోలో శేష్ చెప్పాడు.


కథ గురించి చేసిన పరిశోధన గురించి తెలిపాడు. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ స్టోరీ ఈ చిత్రానికి స్ఫూర్తినివ్వడమే కాకుండా మార్గనిర్దేశం కూడా చేసిందని పేర్కొన్నాడు.


ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ – వినాయక్, బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ


సైయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ ‘మేజర్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే : అడవి శేష్, స్క్రిప్ట్ గైడెన్స్, డైలాగ్స్ : అబ్బూరి రవి, హిందీ డైలాగ్స్ : అక్షత్ అజయ్ శర్మ, కెమెరా : వంశీ పచ్చిపులుసు, సంగీతం : శ్రీ చరణ్ పాకాల.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *