కంపెనీలు తరలింపుల్లో..చైనాకు షాక్ ఇచ్చి భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జపాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జపాన్ దేశం చైనాకు షాక్ ఇచ్చి…భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. చైనాలో ఉండే తమ కంపెనీలను వేరే దేశానికి తరలించాలని జపాన్ దేశం యోచిస్తోంది. ఈ క్రమంలో తమ కంపెనీలను భారత్ కు తరలిస్తే భారీ రాయితీలు కూడా ఇస్తామని ప్రకటించింది. పక్కదేశాలతో కజ్జాలు పెంచుకుంటూ చైనా చేసే దుందుడుకు చర్యలతో పలు దేశాల నుంచి వ్యతిరేకను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జపాన్ కూడా చైనా నుంచి తమ కంపెనీలను భారత్ లేదా బంగ్లాదేశ్ లకు తరలించాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో భారత్ కు తమ కంపెనీలు తరలించుకుంటే భారీ రాయితీలు ఇస్తామని తెలిపింది. ఇది చైనాకు పెద్ద షాక్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే చైనా వస్తువులు..యాప్ ల వాడకంపై వ్యతిరేకత రావటమే కాకుండా బ్యాన్ దెబ్బ కూడా పడింది. ఈ క్రమంలో జపాన్ తీసుకునే ఈ నిర్ణయం చైనా వాణిజ్య వ్యవస్థపై పెద్ద దెబ్బపడే అవకాశముంది.ఆసియాన్ ప్రాంతంలో కంపెనీల విస్తరణను ప్రోత్సహించే లక్ష్యంతో 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఏకంగా 23,500 కోట్ల యెన్‌లు (22.1 కోట్ల డాలర్లు) కేటాయించింది. చైనాలోని సంస్థలు తమ ఉత్పత్తి కేంద్రాలను భారతదేశానికి కానీ, లేదంటే బంగ్లాదేశ్‌కు కానీ తరలిస్తే భారీ రాయితీలు ఇవ్వాలని జపాన్ నిర్ణయించినట్టు నిక్కీ ఏసియాన్ రివ్యూ నివేదిక పేర్కొంది.

చైనా దూకుడుకు కళ్లెం వేసే శక్తి ఉంది…త్రివిధ దళాధిపతి కీలక వ్యాఖ్యలు


ఔషధ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని ఆసియా దేశాలన్నింటికీ విస్తరించాలన్నది జపాన్ ప్రభుత్వ లక్ష్యమని ఆ నివేదిక వివరించింది. వాస్తవానికి జపాన్‌కి చెందిన ఉత్పత్తి ప్లాంట్లు అత్యధికం చైనాలో ఉన్నాయి. అయితే, కరోనా వైరస్ కారణంగా వాటి ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి కంపెనీలను తరలిస్తే భారీ రాయితీలు ఇస్తామని ప్రకటించడం చైనాకు షాకేనని నిపుణులు చెబుతున్నారు. కాగా, భారత్‌కు తరలిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామన్న జపాన్ ప్రకటనతో భారత్‌లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Related Tags :

Related Posts :