లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘మక్కల్ సెల్వన్’ మాస్ లుక్ అదుర్స్..

‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ న్యూ పోస్టర్ రిలీజ్..

Published

on

Makkal Selvan Vijay Sethupathi as  'Rayanam' from Uppena

‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ న్యూ పోస్టర్ రిలీజ్..

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ చిత్రంలో పాపులర్ తమిళ నటుడు, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ‘ఉప్పెన’ సినిమాలో ఆయన లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా విజయ్ సేతుపతి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్‌లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించగా ఈ పోస్టర్‌లో యంగ్ లుక్‌తో సిగరెట్ కాలుస్తూ కనిపించారు సేతుపతి.

సినిమా లవర్స్‌ను ఆకట్టుకుంటుందీ పోస్టర్. ఈ చిత్రంలో ‘రాయణం’ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయనది విలన్ పాత్ర కావడం విశేషం. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ‘ఉప్పెన’ కరోనా కారణంగా వాయిదా పడింది. ‘నీ కన్నునీలి సముద్రం’ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సానా.. దర్శకుడిగా పరిచయమవుతుండగా కృతి శెట్టి నాయికగా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సాంకేతిక వర్గం :
కథ, దర్శకత్వం : బుచ్చిబాబు సానా
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : అనిల్ వై, అశోక్ బి.
సీఈవో : చెర్రీ
సినిమాటోగ్రఫీ : శాందత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీప్రసాద్
ఎడిటర్ : నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్ : మౌనిక రామకృష్ణ
బ్యానర్స్ : మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.
 

Makkal Selvan Vijay Sethupathi as  'Rayanam' from Uppena

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *