లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మలైకా లాక్‌డౌన్ లడ్డూలు.. డైవర్స్ అప్పుడు నా కొడుకు ఏం అన్నాడంటే..

లాక్‌‌డౌన్ సమయంలో లడ్డూలు చేస్తున్న బాలీవుడ్ భామ మలైకా అరోరా..

Published

on

Malaika Arora Preparing Laddu's Lockdown days and Talking About her Divorce

లాక్‌‌డౌన్ సమయంలో లడ్డూలు చేస్తున్న బాలీవుడ్ భామ మలైకా అరోరా..

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి పట్టున ఉంటున్న సెలబ్స్ వంట చేయడం, వర్కవుట్‌లు, ఇంటిని శుభ్రపరుచుకోవడం, నిద్రించడం, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం లాంటి పనులతో బిజీగా గడుపుతూనే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే కరోనాపై పోరాటానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజాగా వయసు పెరుగుతున్నా వన్నె తరగని బాలీవుడ్ భామ మలైకా అరోరా లాక్‌డౌన్ సమయంలో లడ్డులు తయారు చేస్తూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో మలైకా అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. ఎందుకయ్యా అంటే ఏ డ్రెస్ వేసుకున్నా ఎప్పుడూ హట్‌ హాట్ లుక్స్‌తో దర్శనమిచ్చే 46 ఏళ్ల  మలైకా ఇప్పుడు ఆంటీలాగా కనిపిస్తోందంట.. ఇదిలా ఉంటే భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న సందర్భంలో జీవితంలోనే అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని.. తన నిర్ణయానికి ఎవరూ మద్దతుగా నిలవలేదని, విడాకులు కోరే ముందు రోజు కూడా నిర్ణయం మార్చుకోమని కుటుంబ సభ్యులు అడిగారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలైకా చెప్పుకొచ్చింది. అయితే తన నిర్ణయానికి కొడుకు అర్హాన్ మద్దతుగా నిలిచాడని తెలిపింది. 

Read Also : కరోనాని పొట్టలోకి తీసుకెళ్లి చంపేద్దాం..

‘‘కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ఎన్నో నిందలు ఎదుర్కోవాలి. నేను విడాకులు తీసుకోవడం సరైనది కాదని ప్రతి ఒక్కరూ హెచ్చరించారు. విడాకులు తీసుకోవడానికి ముందు రోజు రాత్రి కూడా నా కుటుంబ సభ్యులు ‘నువ్వు డైవర్స్‌కు సిద్ధంగానే ఉన్నావా?’ అని అడిగారు. తన ముందున్న పరిస్థితులను అర్థం చేసుకున్న నా కొడుకు అర్హాన్ మాత్రం నన్ను సమర్థించాడు. ఓ రోజు అర్హాన్‌ నా దగ్గరికి వచ్చి ..‘ అమ్మా.. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయి.. నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను అని చెప్పాడ’ని మలైకా గుర్తు చేసుకుంటూ మలైకా భావేద్వేగానికి లోనైంది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by ᴍᴏᴅᴇʟ’s ʀᴇǫᴜɪʀᴇᴍᴇɴᴛs (@_model_hub_ooficial_) on

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *