లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

మోడ్రన్ డ్రెస్సులతో..70 ఏళ్ల నటి ఫోటో షూట్..పిచ్చెక్కిస్తున్న పిక్స్ పై ట్రోలింగ్

Published

on

Malayalam actress Rajini chandi photoshoot : ఫోటో షూట్ అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది. పెళ్లిళ్లకే కాదు చిన్న చిన్న ఈవెంట్లకు కూడా ఫోటో షూట్ కామన్ అయిపోయింది. అంతెందుకు? కొత్త బట్టలుకొనుక్కున్నా ఫోటో షూట్ లే. ఈ ఫోటో షూట్ లకు వయస్సులతో కూడా సంబంధం లేదనీ ఇంట్రెస్ట్ ఉంటే చాలని నిరూపించారు 70 ఏళ్ల మళయాళ నటి రజనీ చాందీ. 69 ఏళ్ల వయస్సులో ఫోటో షూట్ లతో పిచ్చెక్కించేస్తున్నారు రజనీ చాందీ. కానీ ఇక్కడ మరో విశేషమేంటంటే..ఎప్పుడూ చక్కటి చీరకట్టుతో..సంప్రదాయంగా కనిపించే రజినీ చాందీ జీన్స్ తో చూసేవారికి షాక్ ఇచ్చారు.అంతేకాదు.. జీన్స్ తోనే కాదు డెనిమ్, ఫ్లోరల్ మ్యాక్సీ ఫోటోలతో పిచ్చెక్కించేశారామె.

యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోటో షూట్ చేయించుకుని గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటం ఈ మధ్యకాలంలో పరిపాటి అయిపోయింది. కానీ ఏడుపదుల వయసున్న రజనీ చాందీ ఫోటో షూట్ చేస్తే.. ఎలా ఉంటుంది? అందులోనూ జీన్స్, డెనిమ్, ఫ్లోరల్ మ్యాక్సీ ఫోటోలతో ఆమె అలా ఉంటుందని అస్సలు ఎవరైనా ఊహించగలరా? అదే జరిగింది. 69 ఏళ్ల వయస్సులో రజినీ చాందీ ఫోటోలు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు చూసిన కొంతమంది ట్రోల్ తో రజనీ చాందిపై పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారు.

ముతస్సి గాథ అనే సినిమాలో బామ్మ పాత్ర ద్వారా రజినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ ఫేమ్‌తోనే మళయాల బిగ్‌బాస్‌ సీజన్-2లోనూ తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈక్రమంలో లాక్‌డౌన్ తరువాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె..ఓ ఫోటోషూట్‌లో పాల్గొని, ఆ ఫోటోలను ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోల్ని చూసిన నెటిజన్లు సినిమాల్లోనూ..బయట కూడా రజినీ చాందీ చక్కటి చీరకట్టులో..సంప్రదాయ డ్రెస్సింగ్ తోనే చూడముచ్చటగా ఉండే ఆమె ఒకేసారి ఆమె ఫోటోలను చూసి మతి పోయినంత పనైంది. ఆ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు రజినీ చాందీపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

‘ఈ వయస్సులో ఇదేం బుద్ధి.?’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు మరో అడుగు ముందుకేసి ఈ వయస్సులో మీకు ఇది అవసరమా? ఇవన్నీ వేషాలకోసమే కదూ..అంటున్నారు. ఇంకొందరైతే.. ‘మీరు ఇంకా చనిపోలేదా.?’ అంటూ వ్యాంగ్యాస్త్రాలతో ఇష్టమొచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ ఫోటో షూట్ లకు ..మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవటానికి వయస్సుతో పనేముంది? అనుకునే మరికొందరు మాత్రం ఆమెను ప్రశంసిస్తూన్నారు.

తనమై వచ్చిన ట్రోలింగ్‌పై రజినీ చాందీ స్పందిస్తూ..నాను నచ్చినట్లుగా నేనున్నాను. ఎవరికో నచ్చేలా నేనెందుకుంటాను? ఒకరి గురించి నేను నా ఇష్టాల్ని చంపుకోవాల్సిన పనిలేదని అన్నారు. త్వరలో తనకు 70 ఏళ్లు నిండుతాయని..ముసలావిడకు దసరా పండుగ అంటూ చేస్తున్న ట్రోలింగ్ ను నేను పట్టించుకోనని తెలిపారు. ఈ వయస్సులో కూడా నేను అందంగా కనిపిస్తే కొందరు అసూయ పడుతున్నారని..ఇష్టాలను నెరవేర్చుకోవటానికి వయస్సుతో సంబంధ లేదని అన్నారు. ఇటువంటివి స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు.

అయితే ఆమె వివరణ ఇచ్చినా నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ ఆపడం లేదు. ఎవరిష్టమొచ్చినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ..నాకు నచ్చినట్లు నేనుంటానని రజినీ చాందీ చెప్పటం మాత్రం చాలా ఆహ్వానించదగిన విషయం..ఒకరిపై ఇష్టమొచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ నీతులు చెప్పేవాళ్లు ఒకరిని జడ్జ్ చేయటానికి వారికి ఏం హక్కు ఉందనే విషయం తెలుసుకోవాలి.