లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఇల్లు లేని ఆ వ్యక్తికి కవచంగా మారిన వీధి కుక్కలు

Published

on

Stray Dogs: మనిషికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలు జంతువులను, ప్రత్యేకించి కుక్కలను చూసి నేర్చుకోవాల్సిందే. తాము ప్రమాదంలో ఉన్నామని తెలిసినా చివరి నిమిషం వరకూ తమ యజమానిని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మలేషియాలో జరిగిన ఈ ఘటన గురించి ఈ ఫొటో స్పష్టమయ్యేలా చేసింది.

ఆ మనిషికి హాని చేయడానికి వచ్చారని భావించిన కుక్కలు సర్కిల్‌లా మూగి కాపాడాలనుకున్నాయి. కానీ, అనుకున్నట్లు జరగలేదు ఆ ఘటన చివర్లో. ఫేస్‌బుక్ పోస్టులో దీని గురించి వివరంగా ఉంది. కజాంగ్‌కు చుట్టూ ఉన్న ప్రాంతంలో ఆరున్నర గంటల పాటు కష్టపడి 20కంటే ఎక్కువ కుక్కలు చుట్టుముట్టిన సీన్ నుంచి క్లియర్ చేశారు సిబ్బంది.నిజానికి వారు వచ్చింది కుక్కలు పట్టుకెళ్లడానికి. కానీ, పాపం ఆ కుక్కలు తమ యజమానికి హాని తలపెడుతున్నారని భావించి ఇల్లు లేని అతణ్ని కాపాడటానికి ప్రయత్నించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కావడంతో నెటిజన్లు కుక్కల పట్ల సానుభూతితో కామెంట్లు చేస్తున్నారు.

stray dogs

‘ఆ కుక్కలు చాలా అమాయక జీవులు. అవి కూడా మీలాగే బతకాలనుకుంటున్నాయి. నేనెప్పుడూ వీధికుక్కలకు హాని చేయాలనుకోలేదు. కొన్నిసార్లు ఆహారం కనపడగానే అరుస్తూ ఉంటాయి. మీరు దాన్ని దూరంగా తీసుకెళ్లాలి అంతే’ అని కామెంట్ చేశాడు.

మరో యూజర్ ‘ఆ కుక్కలు చాలా అమాయకంగా ఉన్నాయి. మీలాగే బతకాలని ఆశపడుతున్నాయి. నేను వాటికెప్పుడూ హాని చేయాలనుకోలేదు. ఇలా సంపాదించడం మీకు సంతోషంగా ఉందనుకుంటున్నారా.. ఆ గతి మీకు తప్పక వస్తుంది. తర్వాతి జనరేషన్ మీకు అలాంటి సమాధానమే ఇస్తుంది. వెయిట్ చేయండి’ అని తిట్టిపోశాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *