Home » ఇంజనీరింగ్ విద్యార్ది జీవన్ రెడ్డి అదృశ్యం వెనుక బెట్టింగ్ మాఫియా హస్తం..!!
Published
11 months agoon
By
veegamteamపేట్ జహీరాబాద్ పీఎస్ పరిధిలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్ధి జీవన్‌రెడ్డి మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిది. జీవన్ రెడ్డి మిస్సింగ్ వెనుక బెట్టింగ్ మాఫియా హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆన్ లైన్ లో బెట్టింగ్ ల్లో జీవన్ రెడ్డి భారీగా నష్టపోయాడనీ..తనకకు తల్లిదండ్రులు పంపించిన కాలేజ్ ఫీజును కూడా బెట్టింగ్ లో పెట్టాడని అలా తీవ్రంగా నష్టపోయిన జీవన్ రెడ్డి సడెన్ గా అదృశ్యం కావటానికి కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు.
తమ కుమారుడైన జీవన్ రెడ్డి గత మూడు రోజులుగా కనిపించకుండా పోయాడనీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి కాల్ డేటాపై ఫోకస్ పెట్టిన పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అతను ఉండే హాస్టల్ పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలో జీవన్ రెడ్డి కోసం గాలింపు కొనసాగిస్తున్న పోలీసులు..పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాడు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక బెట్టింగ్ మాఫియా వ్యక్తులు జీవన్ రెడ్డిని కిడ్నాప్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు అతని తండ్రి మరో విషయాన్ని చెప్పాడు. కొంతమంది నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ..ఫోన్ చేసివాళ్లు జీవన్ రెడ్డి ఓ లోన్ తీసుకున్నాడనీ ఆ లోన్ వెంటనే కట్టేయాలని వారు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. ఆ ఫోన్ కాల్స్ బెట్టింగ్ మాఫియా నుంచే అయి ఉండవచ్చని…భావిస్తున్నారు. కానీ ఏది ఏమైనా నా కొడుకును మాత్రం సురక్షితంగా అప్పగించమని జీవన్ రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల్ని వేడుకుంటున్నారు.
పేట్ జహీరాబాద్ పీఎస్ పరిధిలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో జీవన్ రెడ్డి థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మూడు రోజుల నుంచి కొడుకు నుంచి ఫోన్ రాకపోవటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్టల్ కు వచ్చారు. కానీ జీవన్ రెడ్డి మూడు రోజుల నుంచి కనిపించట్లేదని తెలియటంతో భయపడినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా జీవన్ రెడ్డి ఉంటున్న హాస్టల్ కు విద్యార్ధులను ప్రశ్నించారు.
జీవన్ రెడ్డి మిస్ అయ్యే ముందు కొన్ని రోజుల నుంచి ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదనీ..ఒంటరిగా ఉండేవాడని..బహుశా బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకోవటం వల్లే అలా ఉండి ఉంటాడని పోలీసులకు చెప్పారు. కాగా మూడు రోజులుగా కనిపించకుండా పోయిన జీవన్ రెడ్డి హాస్టల్ బాత్రూమ్ లో ఓ బ్లేడు..రక్తపు మరకలు కనిపించటంతో భయాందోళనలకు గురైనా అతని తల్లిదండ్రులు తమ కొడుకు క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు.