Home » ఇంజనీరింగ్ విద్యార్ధి జీవన్‌రెడ్డి మిస్సింగ్ కేసులో అనుమానాలు..బాత్రూమ్లో రక్తపు మరకలు
Published
12 months agoon
By
veegamteamమల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్ధి జీవన్ రెడ్డి మిస్సింగ్ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవన్ రెడ్డి హాస్టల్ రూమ్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించటంతో తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా..జీవన్ రెడ్డి గత మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ ఇప్పటి వరకూ జీవన్ రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు.
ఈ క్రమంలో జీవన్ రెడ్డి హాస్టల్ రూమ్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించటంతో అసలు జీవన్ రెడ్డి బ్రతికే ఉన్నాడా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక హత్య చేశారా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు భాయాందోళనలకు గురవుతున్నారు. తమ బిడ్డ కోసం తల్లడిల్లిపోతున్నారు.
పేట్ జహీరాబాద్ పీఎస్ పరిధిలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో జీవన్ రెడ్డి థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మూడు రోజుల నుంచి కొడుకు నుంచి ఫోన్ రాకపోవటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్టల్ కు వచ్చారు. కానీ జీవన్ రెడ్డి మూడు రోజుల నుంచి కనిపించట్లేదని తెలియటంతో భయపడినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా జీవన్ రెడ్డి ఉంటున్న హాస్టల్ కు విద్యార్ధులను ప్రశ్నించారు.
దానికి వారు జీవన్ రెడ్డి మిస్ అయ్యే ముందు కొన్ని రోజుల నుంచి ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదనీ..ఒంటరిగా ఉండేవాడని తెలిపారు. దీంతో కథమళ్లీ మొదటికి రావటంతో దర్యాప్తును కొనసాగిస్తున్నారు? అసలు జీవన్ రెడ్డి బ్రతికే ఉన్నాడా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక హత్య చేశారా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు భాయాందోళనలకు గురవుతున్నారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
See Also : ఇంజనీరింగ్ విద్యార్ధి జీవన్‌రెడ్డి మిస్సింగ్ కేసులో అనుమానాలు..బాత్రూమ్ రక్తపు మరకలు