లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

అమిత్ షా ఫోటోపై మమత సెటైర్లు

Published

on

Amit Shah’s Lunch At Tribal Family a ‘Show Off’ వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌ లో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ దూకుడుతో అక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. బీహార్‌ విజయంతో బీజేపీ మంచి జోరు మీద ఉంది. బెంగాల్ లో కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్య బీజేపీ నాయకులు ఇటీవల కాలంలో బెంగాల్ లో పాటిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బెంగాల్ లో ప్రయతించిన విషయం తెలిసిందే. .అమిత్‌ షా రాకతో బెంగాల్‌ రాజకీయాలు కొత్త మలుపులు తిరగనున్నాయి. తన బెంగాల్‌ పర్యటనలో బంకురా జిల్లాలో ఒక గిరిజన పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్‌షా భోజనం చేస్తుండగా తీసిన ఫోటోను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనిపై తాజాగా స్పందించిన మమత తీవ్రంగా విమర్శించారు.సీఎం మమతా బెనర్జీ అమిత్‌ షాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బయట ఫైవ్ స్టార్ హోటల్స్ నుంచి తెచ్చిన భోజనం తింటూ గిరిజన కార్యకర్త ఇంట్లో తింటున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.గిరిజనుల ఇంట్లో అమిత్‌ షా భోజనం ఒక షో అఫ్ అని మమత విమర్శించారు.రాష్ట్ర ప్రజలకు ఉచిత రేషన్‌ పంపిణీ జూన్‌ వరకు ఇచ్చామని దానిని ఇంకా పెంచుతామని మమత ప్రకటించారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ మే మధ్య ఎన్నికలు జరుగనున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *