Mammootty's Raja Narasimha Censor Completed.. Releasing on 22nd November

మమ్ముట్టి ‘రాజా నరసింహా’ సెన్సార్ పూర్తి : నవంబర్ 22 విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘మధుర రాజా’ తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో ఈ నెల 22న విడుదల కానుంది..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘మధుర రాజా’ తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్ ‘మన్యంపులి’ ఫేమ్ వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. జై, మహిమా నంబియార్‌కీలక పాత్రధారులు. జగపతిబాబు విలన్‌..

‘రాజా నరసింహా’ సినిమాను జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా ‘రాజా నరసింహా’ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు.. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉందని, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు చెప్పారు.

Read Also : నా క్యారెక్టర్ హాలీవుడ్‌ ‘యాక్షన్’ మూవీలో హీరోయిన్స్‌లా ఉంటుంది

సన్నీలియోన్‌ చేసిన స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తుంది నిర్మాత తెలిపారు. ఈ నెల 22న ‘రాజా నరసింహా’ విడుదల కానుంది. సంగీతం : గోపి సుందర్, కెమెరా : షాజీ కుమార్, ఎడిటింగ్ : మహేష్ నారాయణన్, సునీల్ యస్ పిళ్లై.
 

Related Tags :

Related Posts :