హిజ్రాతో ప్రేమ-పెళ్లి ……ఆస్తికోసం ఆమె దత్తపుత్రుడిపై హత్యాయత్నం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

murder attempt : తమిళనాడులోని సేలం జిల్లా పల్లప్పట్టి పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే కన్నకి(33) ట్రాన్స్ జెండర్. ఆమె తన సంపాదనతో స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది. అది కాక మరో 30 లక్షల రూపాయల ఆస్తులను ఆమె సంపాదించుకుంది. ఆమె ఆస్తులను కాజేయాలనే ఆలోచనతో సేలం లైన్ హిల్ ప్రాంతానికి చెందిన అఫ్జల్ ముబారక్ అనే యువకుడు ఆమెతో ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.

ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకుని 5ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని స్టేట్ బ్యాంకు ప్రాంతంలో కాపురం పెట్టారు. కన్నకి దంపతులకి పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి పిల్లలమీద మోజుతో రాహుల్ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. భర్త ముబారక్, పిల్లాడు రాహుల్ తో కన్నకి సంతోషంగా జీవనం సాగిస్తోంది.ఇంతలో ముబారక్ కి దుష్ట ఆలోచన వచ్చింది. కన్నకి ఆస్తి తాను కొట్టేద్దామనుకుంటే ఇప్పడు పిల్లాడ్నిపెంచుకుంటోంది. భవిష్యత్త్తులో ఆస్తి మొత్తం పిల్లాడికి వెళ్లిపోతుందనే భయం పట్టుకుంది. వాటిని తానే అనుభవించాలనుకున్నాడు. ఆస్తి తన పేర రాయమని కన్నకిని కోరాడు. అందుకు ఆమె ససేమిరా ఒప్పుకోలేదు.

ఆస్తి తన తదనంతరం పిల్లాడికే చెందుతుందని కరాఖండిగా చెప్పేసింది. ఈ విషయంగా వారిద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. అయినా మళ్లీ సర్దుకుని కాపురం చేయసాగారు. రాన్రాను కన్నకి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనే దుర్భుద్ది ముబారక్ లో పెరగసాగింది.రాహుల్ ను చంపేస్తానని బెదిరించటం మొదలెట్టాడు. కన్నకి భర్తకు అలా చేయవద్దని వేడుకుంది. అయినప్పటికి కన్నకి బెదరక పోయే సరికి పిల్లాడి మెడ మీద కత్తిపెట్టి బెదిరించటం మొదలెట్టాడు. అప్పటికే ముబారక్ వేధింపులతో విసిగి పోయిన కన్నకి ఒకరోజు భర్తకు తెలియుకుండా రాహుల్ ను కత్తితో బెదిరించిన వీడియోను సెల్ ఫోన్లో చిత్రీకరించింది.ఆ సాక్ష్యాధారాలతో పల్లప్పట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు ముబారక్ ను అరెస్ట్ చేసారు. అతడిపై హత్యాయత్నం. పిల్లలపై వేధింపులు, చంపుతాననిబెదిరించటం వంటి 5 కేసులు నమోదు చేసారు. ప్రేమ ముసుగులో వచ్చి ఆస్తులు అనుభవించాలనుకున్న ముబారక్ జైలు జీవితం గడుపుతున్నాడు.

Related Tags :

Related Posts :