ఆరోసారి బిడ్డనే పుడుతుందన్న పూజారీ..భార్య కడుపుపై కొడవలితో దాడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Man attacks wife : భేటీ బచావో..భేటీ పడావో, ఆడపిల్లలను కాపాడుకుందాం..అని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా..కొంతమందిలో మార్పు రావడం లేదు. గర్భంలో ఆడపిల్ల ఉందా ? మగ శిశువు ఉందా అనే అనుమానంతో ఓ దుర్మార్గుడు గర్భాన్ని కోసిన ఘటన మరిచిపోకముందే..మరో ఘటన చోటు చేసుకుంది.

మరోసారి ఆడపిల్లే పుడుతుందని పూజారీ చెప్పిన మాటలను నమ్మిన ఓ వ్యక్తి గర్భిణీగా ఉన్న భార్యపై కొడవలిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దంపతులకు అప్పటికే ఐదుగురు ఆడపిల్లలు ఉండడం విశేషం.ఢిల్లీలో Civil Lines ప్రాంతంలో పన్నాలాల్ (43), అనీతా దేవి (40) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదుగురు ఆడపిల్లలున్నారు. పన్నాలాల్ కార్మికుడిగా పని చేస్తున్నారు. మగ సంతానం కావాలని పన్నాలాల్ కు కోరిక ఉండేది. అనీతా దేవి మరోసారి గర్భం దాల్చింది.

శనివారం ఇంటికి వచ్చిన పన్నాలాల్ భార్యతో పుట్టబోయే దానిపై వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆవేశానికి లోనైన పన్నా..కొడవలితో ఆమె కడుపుపై దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అనితను బరేలీలో ఓ ఆసుపత్రికి తరలించారు. కడుపుపై, ఛాతిపై తీవ్రగాయాలతో ఉన్న అనితను ఆసుపత్రికి తీసుకొచ్చారని Emergency medical officer at the district hospital Dr. Rajesh Kumar వెల్లడించారు.పదునైన ఆయుధంతో దాడి చేయడం వల్ల తీవ్రగాయాలయ్యాయని, విషమంగా ఉన్న ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు.
ఐదుగురు ఆడ సంతానం కావడంతో..తన సోదరిని కొడుతూ..వేధించే వాడని అనిత సోదరుడు చెప్పాడు.తన తల్లిదండ్రులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారని, కానీ ఇంత ఘోరానికి పాల్పడుతాడని అనుకోలేదని ఆవేదనతో వెలిబుచ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని Civil Lines police station SHO Sudhakar తెలిపారు. మహిళ నుంచి ఫిర్యాదు ఇంకా రాలేదని తెలిపారు.

Related Posts