వరల్డ్ రికార్డ్ కోసం.. 853చప్పట్లు ఒంటి చేత్తో.. ఒక్క నిమిషంలో..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలి కదా. కానీ ఒంటి చేత్తలో చప్పట్లు కొట్టి వరల్డ్ రికార్డు కోసం ట్రై చేశాడో వ్యక్తి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇంపాజిబుల్ విషయాన్ని చేసి చూపించాడు న్యూయార్క్ కు చెందిన కారీ మాకెల్లరో. ఒక్క నిమిషంలో వీలైనన్ని ఎక్కువ చప్పట్లు కొట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం ట్రై చేశాడు.బ్రూక్‌హావెన్ కు ముందు హెరిటేజ్ పార్క్ లో పలువురు సాక్ష్యంగా ఉండగా ఈ ఫీట్ చేశాడు. మొత్తం 853చప్పట్లు అంటే సెకనుకు 14చప్పట్లు అన్నమాట. ఇది చేయడంతో అతను గతంలో ఉన్న 685చప్పట్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఇరాక్ కు చెందిన హస్సన్ అల్గజాలి పేరిట 2019లో ఈ రికార్డు నమోదైంది.

రాక్కీ పాయింట్ కౌన్సిల్ ఉమెన్ జానె బానర్ సమక్షంలో ఈ ప్రయత్నం జరిగింది. ‘గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రయత్నానికి సాక్షిగా వ్యవహరించడం నాకు ఇదే తొలిసారి. నేను కచ్చితంగా చెప్పాలి. ఇది చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. అతని జీవితంలో ముఖ్యమైన రోజు కూడా’ అని బానెర్ అన్నారు.ఒంటి చేతి చప్పట్ల వీడియోను.. ఆడియోను స్లో చేసి.. లెక్కిస్తారు. అని కారీ టీం చెప్తుంది. వారంతా డిఫరెంట్ మెథడ్స్ తో చప్పట్లను లెక్కించారు. ప్రస్తుతం గిన్నీస్ రికార్డు అఫీషియల్ సర్టిఫికేషన్ కోసం ఈ ఫీట్ ఆడియో, వీడియోను పరీక్షిస్తారు. దీనిని వెరిఫై చేయడానికి దాదాపు 12వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Related Tags :

Related Posts :