లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కారులో ప్రియురాలితో దోసె తింటున్న భర్త.. పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లిన భార్య!

Published

on

Man Caught by Wife after Ordered Dosa : ప్రియురాలికి దోసె ఆర్డర్ చేశాడు.. భార్యకు అడ్డంగా దొరికిపోయాడో భర్త. ప్రియురాలితో కలిసి తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాందాలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి కొన్నాళ్ల క్రితమే వివాహమైంది. భార్యను పట్టించుకోని అతడు.. ప్రియురాలితో చాటుగా ప్రేమాయణం నడుపుతున్నాడు.

భార్యను కాదని ప్రియురాలితో కలిసి గుడికి వెళ్లాడు. అదే గుడికి భార్య కూడా వచ్చింది. ఆ విషయం గమనించని అతడు ప్రియురాలికి కారులోనే వేడి వేడి దోసె ఆర్డర్ చేశాడు. ఇద్దరూ కలిసి దోసె తింటున్నారు. అటుగా వచ్చిన భార్య.. వారిద్దరిని కారులో చూసి ఆగ్రహంతో ఊగిపోయింది. కారులో ఉన్నవారిద్దరిని బయటకు లాగేసింది. ఎప్పటినుంచి జరుగుతుంది ఈ వ్యవహారమంటూ కోపంతో రగిలిపోయింది.

వెంటనే సోదరుడిని పిలిపించి అక్కడే భర్తను, అతడి ప్రియురాలిని కడిగిపారేసింది. అంతటితో ఆగలేదు. ఇద్దరిని పోలీసు స్టేషన్ కు లాక్కెళ్లింది. తనను మోసం చేసి మరో మహిళతో తిరుగుతున్నాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలా జరిగితే కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు.