గర్భవతిని చేశాక కులం గుర్తొచ్చింది, న్యాయం కోసం యువతి పోరాటం

man cheat young girl in the name of caste

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయం వచ్చే సరికి కులం ప్రస్తావన తెచ్చాడు. కులాలు వేరని పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కాట్న మహేందర్‌(28), అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం పెట్టుకున్నాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాదిగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. యువతికి మాయమాటలు చెప్పిన యువకుడు శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. అతడిని పూర్తిగా నమ్మిన యువతి బాగా దగ్గైంది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. 

కులం వేరని పెళ్లికి నిరాకరణ:
తనను పెళ్లి చేసుకోవాలని అమ్మాయి పట్టుబట్టింది. దీంతో యువకుడు ముఖం చాటేశాడు. కులం ప్రస్తావన తీసుకొచ్చాడు. నీ కులం వేరు నా కులం వేరు, పెళ్లి చేసుకోవడం కుదరదని యువకుడు తేల్చి చెప్పాడు. డబ్బులిచ్చి అమ్మాయిని వదిలించుకోవాలని చూశాడు. బాధితురాలు మాత్రం లొంగలేదు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అయితే అమ్మాయికి సంబంధించి కచ్చితమైన వయసు నిర్ధారణ కాకపోవడంతో ప్రస్తుతం అత్యాచారం, మోసం సెక్షన్ల కింద యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read: సొంతూరికి వెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన ఘనుడు

మరిన్ని తాజా వార్తలు