పెళ్లి పేరుతో సహజీవనం….మరోకరితో పెళ్లి…బంజారా హిల్స్ పీ.ఎస్.లో కేసు నమోదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉదయ్ నగర్ కు చెందిన యువతి హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న శివశంకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ కల్సి పెళ్లి చేసుకుని జీవించాలనుకున్నారు.

ఇరువైపులా పెద్దలు వీరి ప్రేమను అంగీకరించారు. ఇంకేముంది శివశంకర్ ఇండియా వచ్చినప్పుడల్లా యువతితో సన్నిహితంగా మెలిగే వాడు. ఇద్దరూ లైంగికంగా ఒక్కటయ్యారు. పెళ్లి కాకుండానే మధురానుభూతులను పంచుకున్నారు. 2019 మేలో పెళ్లి చేసుకోవాలను కున్నారు. ఇంతలో అనుకోకుండా …. ఆసమయంలో యువతి కుటుంబంలో ఆర్దిక సమస్యలు తలెత్తడంతో వివాహాన్ని 2020 మార్చికి వాయిదా వేసుకున్నారు.అందుకు శివ శంకర్ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. శివశంకర్ దుబాయ్ వెళ్లిపోయాడు. ఇండియా వచ్చినప్పుడల్లా ప్రేయసి ప్రియులు లైఫ్ ఎంజాయ్ చేయసాగారు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ రమ్మని, శివశంకర్ యువతిని కోరాడు. కొద్ది రోజులకు ఆ యువతి దుబాయ్ వెళ్ళింది.

తలంబ్రాలు పోసుకుంటున్న వధూవరుల నెత్తిమీద జీలకర్రా బెల్లం ఎత్తుకుపోయిన కోతి


అక్కడ అతను చెప్పిన అడ్రస్ లో లేకపోవటంతో, శివ శంకర్ ఉద్యోగం చేసే కార్యాలయానికి వెళ్లి అతడి గురించి ఎంక్వైరీ చేసింది. శివశంకర్ ఇండియా వెళ్ళినట్లు తోటి ఉద్యోగులు చెప్పారు. యువతి వాకబు చేయగా…. శివ శంకర్ మరో యువతిని పెళ్ళి చేసుకున్నట్లు తెలుసుకుంది.
హైదరాబాద్ తిరిగి వచ్చింది. కొన్నాళ్ళు తనతో సహజీవనం చేసి….. మోసం చేసి ఇప్పడు వేరే యువతిని పెళ్ళి చేసుకున్నాడని శివ శంకర్ పై ఆమె బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Related Posts