లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

india

మెట్రోలో గుండెనొప్పితో పడిపోయిన ప్రయాణికుడు.. క్షణాల్లో స్పందించి ప్రాణం నిలబెట్టిన పోలీస్

Published

on

Delhi Metro Station: మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వణుకుతూ పడిపోయిన వ్యక్తి ముఖంపై భయం కనిపిస్తుండటంతో అక్కడి ప్రయాణికులంతా నిశ్చేష్టులై షాక్ లో ఉండిపోయారు. వెంటనే అక్కడ డ్యూటీలో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్పందించాడు. ప్రథమ చికిత్స చేసి ఓ ప్రాణాన్ని నిలబెట్టాడు.

ఈ ఘటన సోమవారం సాయంత్రం 6గంటల 50నిమిషాలకు ఢిల్లీ మెట్రో స్టేషన్ లో జరిగింది. ఉన్నట్టుండి ముందుకు పడిపోవడంతో ఆ వ్యక్తి ముఖానికి, నోటికి గాయాలయ్యాయని అధికారులు చెప్పారు.

‘పేషెంట్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోవడం, శ్వాస ఆడకపోవడాన్ని కానిస్టేబుల్ గమనించాడు. అలా పడిపోవడంతో నోటికి/ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే పోలీస్ స్పందించి కార్డియోపల్మనరీ రెసూసైటేషన్ (సీపీఆర్) చేసి ప్యాసింజర్’ ను కాపాడాడు.

స్పృహ వచ్చాక అతని పేరు సత్యనారాయణ అని జానక్‌పురీకి చెందిన వ్యక్తిగా చెప్పాడు. కండిషన్ తెలియకపోవడంతో ముందుగా అంబులెన్స్ తెప్పించి ఉంచారు. ‘సీఐఎస్ఎఫ్, స్టేషన్ కంట్రోలర్ స్పాట్ కు చేరి ప్రయాణికుడికి మెడికల్ అసిస్టెన్స్ కోసం హాస్పిటల్ కు వెళతారా అని అడిగాం. దానికి అతను నిరాకరించాడు’ అని స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.