లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కామన్ మ్యాన్‌కు కోపమొస్తే.. ఏకంగా కరెంటు స్థంభాన్ని కలుపుకుని ఇల్లు కట్టుకున్నాడు

Published

on

house current pole : అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఆ ఊరిలో హాట్ టాపిక్ గా మారింది. అంతా విస్తుపోతున్నారు. అధికారులేమో షాక్ లో ఉన్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా.. ఏకంగా కరెంటు స్థంభాన్ని కలుపుకుని ఇల్లు కట్టుకున్నాడు.

వికారాబాద్ జిల్లా థారూర్ మండలం కెరెళ్లి ఊరులో ఈ ఘటన జరిగింది. కెరెళ్లి నాలుగో వార్డు మెంబర్ బుచ్చయ్య ఇల్లు కట్టుకున్నాడు. వార్డు మెంబర్ అనే ధైర్యమో మరో కారణమో కానీ.. కరెంటు స్థంభాన్ని కలుపుకుని మరీ ఇల్లు కట్టాడు. ఎందుకిలా చేశావ్ అని అడిగితే.. చాలా రోజుల నుంచి కరెంట్ ఆఫీస్ వాళ్లను బతిమాలుకున్నాడట. ఆ విద్యుత్ స్థంభాన్ని అక్కడి నుంచి తీసి అటో ఇటో జరపాలని దరఖాస్తు కూడా పెట్టుకున్నాడట. కానీ అధికారులు అస్సలు పట్టించుకోలేదట.

అంతేకాదు స్థంభాన్ని జరపాలంటే రూ.3 లక్షలు ఖర్చు అవుతాయని అధికారులు చెప్పారట. దీంతో బుచ్చయ్య కంగుతిన్నాడు. 3లక్షలు పెడితే సగం ఇల్లే కట్టడం అయిపోతుందని భావించి తెగించాడు. ఇక లాభం లేదనుకుని ఏకంగా విద్యుత్ స్థంభాన్ని కలుపుకుని ఇల్లు కట్టేశాడు.

హిందువా? ముస్లిమా అనేది ముఖ్యంగా కాదు..వాళ్లు మేజర్లా కాదా అనేది ఇంపార్టెంట్ : HC


కాగా, కరెంటు స్థంభానికి విద్యుత్ తీగలు ఉన్నాయి. కరెంటు కూడా సప్లయ్ అవుతోంది. అయినా దాన్ని కలుపుకుని ఇల్లు కట్టేశాడు. ఈ పోల్ ఎప్పటికైనా ప్రమాదమే. కరెంట్ షాక్ కొట్టొచ్చు. అయితే ఇప్పుడు కరెంటు స్థంభాన్ని తీస్తే ఇంటి స్లాబ్ డ్యామేజ్ అవుతుంది. అలా అని స్థంభాన్ని అలానే ఉంచితే చాలా ప్రమాదం. ఇంత జరిగినా కరెంటోళ్లకు తెలియకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఊరి వాళ్లు కూడా స్పందించకపోవడం గమనార్హం. మరిప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఆ ఇంటికి డ్యామేజ్ జరక్కూడదు, అతడికి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *