లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఆరు లక్షల తేనెటీగలను కప్పుకుని రికార్డు కొట్టేసిన వ్యక్తి

Published

on

రికార్డు దక్కించుకోవడం కోసం ప్రాణాలకు తెగించేశాడా వ్యక్తి. Guinness World Records కోసం అద్భుతంగానూ, షాకింగ్‌గానూ అనిపించే పనిచేశాడు. 6లక్షల 37వేలకు పైగా తేనెటీగలను శరీరంపై ఎక్కించుకుని అతను చేసిన ఫీట్‌కు అంతా ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టడం వంతైంది. రువాన్ లియాంగ్‌మింగ్ అనే వ్యక్తి తేనెటీగలతో రికార్డు కొట్టేశాడు.

చైనాకు చెందిన రువాన్ లియాంగ్ మింగ్‌కు తేనెటీగలంటే చాలా ఇష్టమట. అందుకే ఈ ఫీట్ చేయగలిగినట్లు ఆయనే చెప్పాడు. దీంతో అతను Heaviest mantle of bees అనే రికార్డును కొట్టేసినట్లు అయింది.ఈ వీడియో చూసి చచ్చిపోతా అంటూ ఓ ఫేస్ బుక్ యూజర్ కామెంట్ చేయగా ఇంకొకరు ఇది అద్భుతమని, మరొకరు లేదు. లేదు. లేదు. లేదు అంటూ కామెంట్ చేశారు.

తేనెటీగలతో డీల్ చేస్తున్నప్పుడు కచ్చితంగా ప్రశాంతంగా ఉండాలి. ఒక్కసారి కుట్టిందంటే తేనెటీగ చనిపోతుంది. నిజానికి వాటికి ఏదైనా హాని జరుగుతుందంటేనే కుడతాయి. అందుకే ప్రశాంతంగా ఉండాలి. ఏదైనా పరిస్థితుల్లో అవి సరైన తీరులో లేవని అనిపిస్తే.. రికార్డు ప్రయత్నానికి బ్రేక్ చెప్పేసి విరమించుకోవాలని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ లియాంగ్ మింగ్ అంటున్నారు.

మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేసి ఎలా చేశాడో తెలుసుకోండి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *