లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

వరంగల్ అర్బన్ జిల్లాలో వ్యక్తి హల్‌చల్.. మద్యంమత్తులో జనం చూస్తుండగానే హైటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని మృతి

Published

on

Man dies of electric shock : వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా పెట్రోల్ పంపు వద్ద ఓ గుర్తు తెలియన వ్యక్తి హల్‌చల్ చేశాడు. పెట్రోల్ పంప్ పక్కనే ఉన్న హైటెన్షన్ పోల్ ఎక్కి వైర్లను ముట్టుకున్నాడు. దీంతో అతనికి వెంటనే షాక్ కొట్టడంతో కింద పడి మరణించాడు. వైర్లను ముట్టుకోవద్దని, పోల్ ఎక్కవద్దని స్థానికులు వారించినా ఆ వ్యక్తి వినకుండా ఎక్కి ప్రాణాలు తీసుకున్నాడు.లేబర్ కాలనీకి చెందిన భరద్వాజ్, స్వాతి భార్యాభర్తలు. వీరికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లులున్నారు. భరద్వాజ్ కుటుంబ పోషణ పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు. కుటుంబ పెద్దలు, పెద్ద మనుషులు అనేక సార్లు అతని బాధ్యతలను గుర్తుచేసినప్పటికీ పట్టించుకోలేదు. బస్టాండు, హోటల్స్ దగ్గర గాలి తిరుగుడు తిరుగుతూ సైకో లాగా వ్యవహరిస్తున్నాడు.తెల్లవారుజామున భరద్వాజ్ ఖిలా పెట్రోల్ పంపు వద్ద హైటెన్ష్ స్తంభం ఎక్కి వైర్లను ముట్టుకున్నాడు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వైర్లను ముట్టుకోవద్దని, పోల్ ఎక్కవద్దని స్థానికులు వారించినా వినకుండా స్తంభం ఎక్కి వైర్లను ముట్టుకున్నాడు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి విద్యుత్ షాక్ తో కింది పడి మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *