man-films-private-moments-during-brief-affair-with-niece-and-blackmail

కీచక మేనమామ, కోడలితో వివాహేతర సంబంధం, పెళ్లి తర్వాత కూడా కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ కీచక మేనమామ తన మేనకోడలి పాలిటి రాక్షసుడిగా మారాడు. మేనకోడలికి మాయమాటలు చెప్పిన ఆ నీచుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. కొన్ని నెలలకు ఆ యువతికి వివాహమైంది. పెళ్లయాక కూడా తనతో సంబంధం కొనసాగించాలని మేనమామ వేధించసాగాడు. కానీ, మేనకోడలు అంగీకరించలేదు. దీంతో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలతో ఆమెను బెదిరించసాగాడు.

గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్‌లోని పూనా ప్రాంతంలో చీరలపై డిజైన్లు వేసే పని చేస్తూ జీవిస్తోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అతడిని నమ్మి సర్వం సమర్పించింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను ఆ వ్యక్తి వీడియో తీసి భద్రంగా దాచుకున్నాడు.

ఆ తర్వాత ఆ యువతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టసాగింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి… వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి వర్గానికి చెందిన ఇతరులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించసాగాడు. ఈ వేధింపులు మరింతగా ఎక్కువకావడంతో ఇక భరించలేని ఆ యువతి కుటుంబ సభ్యులు సూరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Related Posts