లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ఆస్తి కోసం దారుణం, కూతురిపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్

Published

on

డబ్బు మీద ఆశ.. బంధాలు, అనుబంధాలను కనుమరుగు చేస్తోంది. ఆస్తి మీద వ్యామోహం మనిషిని హంతకుడిగా మారుస్తోంది. ఆస్తి దక్కించుకోవడానికి రక్త సంబంధీకులను కూడా కడతేరుస్తున్న రోజులివి. ఒడిశా రాష్ట్రంలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. ఆస్తి కోసం ఆ వ్యక్తి సొంత సోదరుడి కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. తనకు కూతురు వరుసైన అమ్మాయిపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలాసోరో జిల్లాలో ఈ దారుణం జరిగింది. కెదువా గ్రామానికి చెందిన చెనారామ్ అనే వ్యక్తికి ఆస్తి విషయంలో తన సోదరుడితో విబేధాలు వచ్చాయి. సోదరుడి మీద కోపం పెంచుకున్న చెనారామ్, సోదరుడి కూతురిని(15) కిడ్నాప్ చేశాడు. నాలుగు రోజులు తీవ్రంగా హింసించాడు. దీంతో బాలిక అనారోగ్యానికి గురైంది. తనను తన తండ్రి దగ్గర వదిలేయాలని బాలిక వేడుకుంది. బాలికను బైక్ పై ఎక్కించుకున్న చిన్నాన్న గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తన స్నేహితులను పిలిపించాడు. ఓ చెరువు దగ్గరికి బాలికను తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చెనారామ్ అతడి స్నేహితులను విచారిస్తున్నారు. కూతురు సమానమైన బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఆస్తి గొడవలే అని చెప్పాడు. సొంత సోదరుడి కూతురిపైనే బాబాయ్ తన స్నేహితులతో అత్యాచారం చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *