man-goes-bald-after-shaving-girlfriends-head-who-suffers-from-alopecia1

ఆమె కోసం ఏమైనా చేస్తా : ప్రేయసికి పేను కొరుకుడు..గుండు చేసుకున్న ప్రేమికుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులు ఒకరితో ఒకరు ఎన్నో ఊసులు చెప్పుకుంటారు. బాసలు చేసుకుంటారు. కానీ..ఆ బాసలు కాలక్రమేణా కరిగిపోతాయి. కానీ కొందరు మాత్రం ఎంత కష్టమైనా సరే..ఇచ్చిన మాట కోసం..ప్రేమించిన వారికి అన్ని సమయాల్లో తోడు నిలుస్తారు. వారి బాధను తమ బాధగా మార్చుకుంటారు. అటువంటిదే ఈ ప్రేమికుడు తీసుకున్ననిర్ణయం. ప్రియురాలి కోసం ఓ ప్రేమికుడు గుండు గీసుకుని ఆమె మీద ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఇంతకీ అతను ప్రియురాలి కోసం గుండు ఎందుకు గీయించుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలని ఉంది కదూ..



బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు రెక్స్‌ చాప్‌మాన్‌ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు ప్రేమికులు. వారిలో ప్రేయసి పేనుకొరుకుడు వ్యాధితో బాధపడుతోంది. రోగ నిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్ల మీద దాడి చేయడం వల్ల ఈ పేను కొరుడు వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకితే జుట్టు భారీగా రాలిపోతుంది. ఈ వ్యాధితో ఆమె చాలా బాధపడుతోంది.

దాంతో ఆమె ప్రియుడు ట్రిమ్మర్‌తో ప్రియురాలికి గుండు చేస్తాడు. ఆమెకు గుండు చేయడం పూర్తయిన తర్వాత తాను కూడా గుండు చేసుకుంటాడు. దీంతో ఆ యువతి భావోద్వేగానికి గురవుతుంది. దానికతను ఆమెను ముద్దు పెట్టుకుంటూ నీకు లేని జుట్టు నాకెందుకు అన్నట్లుగా..తన చిన్న ముద్దుతోనే ప్రేమనుతెలియజేస్తాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నిజమైన ప్రేమ అంటే ఇదీ అని ఈ జంటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


– – –



Related Posts