man hacks  wife, paramour to death, surrenders to police

కొడుకు వయసున్న ఎదురింటి కుర్రాడితో ఆంటీ రొమాన్స్ ప్రాణాలుతీసింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్న వార్తలు చూస్తున్నా సమాజంలో ప్రజలు వాటిపైనే ఎక్కువ వ్యామోహం పెంచుకుంటున్నారు. అక్రమ సంబంధానికి వయస్సు కూడాచూడటం లేదు. హద్దులేని వారి వాంఛకు వయస్సు అడ్డం కావటంలేదు. కొడుకు వయస్సున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ …ఆ యువకుడితో రొమాన్స్ చేస్తూ భర్త చేతిలో హత్యకు గురైంది. 

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పశువందన్ సమీపంలోని పుంగవర్ నత్తం గ్రామంలో షణ్ముగం(58) వ్యవసాయం చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం భార్యతో మనస్పర్ధలు రావటంతో ఆమెకు విడాకులు ఇచ్చి మారియమ్మాళ్(46) అనే మహిళను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. షణ్ముగానికి మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, కుమార్తె పుట్టగా..రెండవ భార్య మారియమ్మాళ్ కు  ఓ కుమారుడు, కుమార్తె పుట్టారు. పిల్లలందరికీ పెళ్ళిళ్లు చేసేయటంతో ఎవరి కాపురాలు వాళ్లు చేసుకుంటుండగా షణ్ముగం మారియమ్మాళ్ తో కలిసి అరుంధతి నగర్ లో కాపురం పెట్టాడు.  

మారియమ్మాళ్  కు ఎదురింట్లో పనిచేసే రామ్మూర్తి(28) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రామ్మూర్తి ఆర్ధిక అవసరాలను ఆమె తీర్చసాగింది. క్రమేపి అది అక్రమ సంబంధానికి దారి తీసింది.  దాదాపు కొడుకు వయసున్న రామ్మూర్తి తో అక్రమ సంబంధం కొనసాగించ సాగింది. భర్త పొలంలో పని చేస్తూ ఉంటే మారియమ్మాళ్ ఇంట్లో రామ్మూర్తితో సరసాలు సాగిస్తూ ఉండేది.   

రామ్మూర్తి  గంటల తరబడి ఆమె ఇంటిలో ఉంటున్నా చుట్టుపక్కల వారు కూడా కొడుకు వయసున్నవాడేకదా అని సరిపెట్టుకుని అనుమానించలేదు. రామ్మూర్తి ఎక్కువ సమయం తన ఇంట్లోనే గడుపుతున్నడానే విషయం షణ్ముగానికి తెలిసింది. ఈవిషయమై  భార్యను హెచ్చరించాడు. అయితే ఆమె ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఎదురింట్లో పనిచేసే యువకుడు …అప్పుడప్పుడు మంచినీళ్ల కోసం వస్తుంటాడని సమాధానం చెప్పి తప్పించుకునేది.

2020, ఫిబ్రవరి 14, శుక్రవారం రాత్రి ఇంటికొచ్చిన షణ్ముగం భోజనం చేసి ఆరు బయట పడుకున్నాడు. శనివారం తెల్లవారుఝూమున… రోజూలాగానే భర్త పొలానికి వెళ్లిపోయి ఉంటాడనుకున్న మారియమ్మాళ్ ఉదయం 6 గంటలకే కోరిక తీర్చుకోటానికి రామ్మూర్తిని రమ్మని ఫోన్ చేసింది. ఇంకేముంది ఆంటీ పిలిచిన ఉత్సాహంలో రామ్మూర్తి కొద్ది నిమిషాల్లోనే షణ్ముగం ఇంటికి చేరుకున్నాడు.  

బెడ్ రూంలో చేరి ఆమెతో సరసాలు మొదలెట్టాడు. తానోకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్లు ఆరోజు షణ్ముగం ఎందుకో ఆలస్యంగా నిద్రలేచాడు. నిద్రలేచిన షణ్ముగానికి తన ఇంట్లో నుంచి పరాయి పురుషుడి మాటలు వినిపించాయి. వెంటనే చాటుగా వెళ్ళి కిటికీ లోంచి ఇంట్లోకి చూశాడు. తన భార్య మారియమ్మాళ్ రామ్మూర్తితో నగ్నంగా రాసలీలలు సాగిస్తూ కనపడింది. ఎన్నిసార్లు హెచ్చరించినా  భార్య తన మాట పెడచెవిన  పెట్టిందనే కోపంలో ఉన్న షణ్ముగం  కొపోద్రిక్తుడయ్యాడు. కొడవలి తీసుకుని గదిలోకి వెళ్లి భార్యను, రామ్మూర్తిని దారుణంగా నరికి చంపాడు. తీవ్రంగా  గాయాలై  ఎక్కువ రక్తం పోవటంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.  

READ  ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతల కోసం కూంబింగ్

వారిద్దరూ మరణించారని నిర్ధారించుకున్న షణ్ముగం వారిని చంపిన కొడవలితో నేరుగా పశువందనై పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కొడుకు వయస్సున్న యువకుడితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో నరికి చంపినట్లు  చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షణ్ముగాన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరియమ్మాళ్ రామ్మూర్తి మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related Posts