Man jailed for faking own abduction ‘for fun’

పోలీసులతో ఆటలా : ఫేక్ ‘కిడ్నాప్’ కాల్ చేసి బుక్కయ్యాడు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సార్.. సార్.. నన్ను రక్షించండి.. ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. గుర్తు తెలియని ప్రదేశానికి నన్ను తీసుకెళ్తున్నారు. కాపాడండి సార్ అంటూ పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. తరువాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

ముంబై: సార్.. సార్.. నన్ను రక్షించండి.. ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. గుర్తు తెలియని ప్రదేశానికి నన్ను తీసుకెళ్తున్నారు. కాపాడండి సార్ అంటూ పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. తరువాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్రమత్తమైన పోలీసు బృందం రంగంలోకి దిగింది. ఫోన్ కాల్ వచ్చిన ప్రదేశం నుంచి తుంగేశ్వర్, పాటా ప్రాంతాల్లో కుంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ, ఫలితం లేదు. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ప్రదేశాన్ని  ట్రాక్ చేశారు. దీని ఆధారంగా అక్కడి స్థానికులను, దుకాణాదారులను ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. ఫోన్ నెంబర్ ఆధారంగా శివకుమార్ గౌతమ్ (36) వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడి ఇంటి వివరాల కోసం గాలించారు. గౌతమ్ కుటుంబాన్ని ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు భావించారు. వసాయి పాటా ప్రాంతంలో ఉన్న గౌతమ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఒక్కసారిగా పోలీసులు ఇంట్లోకి రావడంతో గౌతమ్ తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించారు. మీ కుమారుడు గౌతమ్ కిడ్నాప్ అయ్యాడు. 

నిద్రపోతున్న గౌతమ్.. షాకైన పోలీసులు
అతడే ఫోన్ కాల్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఫోన్ చేశాడని చెప్పారు. అది విన్న తల్లిదండ్రులు అయ్యో.. లేదండీ.. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదిగో చూడండి.. మా బాబు ఇంట్లోనే నిద్రపోతున్నాడు అని చెప్పారు. తీరా లోపలికి వెళ్లి చూడగా బెడ్ పై హాయిగా గౌతమ్ నిద్రపోతున్నాడు. పోలీసులు షాకయ్యారు. వెంటనే అతన్ని నిద్రలేపారు. పోలీసులను చూసి గౌతమ్ కంగుతిన్నాడు. ఏదో సరదాగా కిడ్నాప్ అయినట్టు పోలీసులకు ఫోన్ చేసానని, దీన్ని ఇంతగా సీరియస్ గా తీసుకుంటారని అనుకోలేదని చెప్పాడు.

నిందితుడు అరెస్ట్.. రూ. వెయ్యి జరిమానా
గౌతమ్ మాటలకు పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం వాసయి కోర్టులో గౌతమ్ ను హాజరుపరిచారు. కోర్టు అతడికి రూ. వెయ్యి జరిమానా విధించింది. కొన్ని గంటల పాటు కోర్టులోనే నిలబడాలని శిక్ష వేసింది. గత ఏడాది డిసెంబర్ లో కూడా సతీశ్ దుబే (35) అనే వ్యక్తి గణేశ్ నగర్ లో మర్డర్ జరిగిందంటూ పోలీసులకు ఫేక్ ఫోన్ కాల్ చేశాడు. అది ఫేక్ కాల్ అని తెలిసిన పోలీసులు దుబేను అరెస్ట్ చేసి ఒక రోజు పోలీసు కస్టడీకి తరలించారు. 

READ  పట్టపగలు యువతి కిడ్నాప్

Related Posts