లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

దారుణం : అక్క మీద కోపంతో కుక్కను చంపేశాడు

హైదరాబాద్‌ లాలాపేటలో దారుణం జరిగింది. అక్కపై కోపంతో ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కను చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆస్తి వివాదంలో అక్కపై కోపం పెంచుకున్న

Published

on

man kill dog

హైదరాబాద్‌ లాలాపేటలో దారుణం జరిగింది. అక్కపై కోపంతో ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కను చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆస్తి వివాదంలో అక్కపై కోపం పెంచుకున్న

హైదరాబాద్‌ లాలాపేటలో దారుణం జరిగింది. అక్కపై కోపంతో ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కను చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆస్తి వివాదంలో అక్కపై కోపం పెంచుకున్న సోదరుడు ఆమెతో గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్క రమాదేవికి చెందిన కుక్క అడ్డు వచ్చింది. దీంతో రమాదేవి తమ్ముడు నాగరాజు అక్క మీద కోపం కుక్క మీద చూపాడు. కుక్క మెడ మీద కాలు వేసి తొక్కి చంపాడు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

కుక్క విశ్వాసానికి మారు పేరు. తిండి పెట్టి చేరదీస్తే శునకాలు నమ్మకం చూపుతాయి. అవసరమైతే యజమాని కోసం ప్రాణాలైనా ఇస్తాయి. ఆ కుక్క కూడా అలానే చేసింది. తన యజమానిపై దాడి చేస్తుండగా పెంపుడు కుక్క అతడిని ప్రతిఘటించింది. దీంతో కోపంతో ఊగిపోయిన నాగరాజు.. కుక్కను కాలితో తన్నాడు. అంతటితో అతడి కోపం చల్లరాలేదు. కుక్క గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిన కుక్కను పోస్టుమార్టానికి తరలించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే నాగరాజు.. రమాదేవి పెంపుడు కుక్కను చంపినట్టు పోలీసుల విచారణలో తేలింది.

అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో రమాదేవి కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. శునకాన్ని చంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మూగజీవి ఏం పాపం చేసిందని వాపోయారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *