లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

సహజీవనం చేస్తున్న మహిళ, మరోకరితో అక్రమ సంబంధం..హత్య

Published

on

వాళ్లిద్దరిదీ అక్రమ సంబంధం.. ఉన్న ఊళ్లో నుంచి పారిపోయి వచ్చారు. హైదరాబాద్ కి వచ్చాక… ఆమె మరోక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది చూసి తట్టుకోలేని పాత ప్రియుడు ఆ వ్యక్తిని హత్య చేశాడు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

కుత్బుల్లా పూర్ భాగ్యలక్ష్మి కాలనీలో పోచమ్మ, కృష్ణ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరిదీ మెదక్ జిల్లా. ఆ గ్రామంలో ఉండగా వీరిద్దరిమధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో వీరిద్దరూ ఉన్న ఊరు వదిలి పెట్టి హైదరాబాద్ ప్రగతి నగర్ లో కాపురం పెట్టారు. బంధువులు అడ్రస్ తెలుసుకుని వచ్చి వారిని మందలించారు.

ఇక లాభం లేదనుకుని అక్కడినుంచి మకాం మార్చి భాగ్యలక్ష్మి కాలనీలో ఉంటున్నారు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే మాధవరావు అనే తాపి మేస్త్రీ ఉంటున్నాడు. మాధవరావు ఇల్లు నిర్మాణం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. మాధవరావుకు పోచమ్మతో పరిచయం ఏర్పడింది.

ఖాళీగా ఉన్న సమయంలో పోచమ్మ, మాధవరావు వద్దకు వెళ్లి కబుర్లు చెపుతూ ఉండేది. క్రమేపి వీరిద్దరూ బాగా సన్నిహితం అయ్యారు. ఓ వైపు కృష్ణతో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే, మరోవైపు మాధవరావుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుంది పోచమ్మ. అవకాశం చిక్కినప్పుడల్లా కృష్ణకు తెలియకుండా పోచమ్మ మాధవరావులు శృంగారాన్ని ఎంజాయ్ చేయటం మొదలెట్టారు.

వీరి వ్యవహారం గుట్టుగా సాగినంత కాలం బాగానే సాగింది. కృష్ణ పోచమ్మ ప్రవర్తనను గమనించాడు అతనికి అనుమానం మొదలైంది. డైరెక్టుగా పోచమ్మను అడగలేక పోయాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకున్నాడు. గురువారం ఆగస్టు6 వతేదీ మధ్యాహ్నం దాకా ఇంట్లో ఉన్న కృష్ణ ఊరెళ్లోస్తానని చెప్పి బయలు దేరాడు. కానీ …. ఊరు వెళ్ళకుండా పోచమ్మ రాకపోకలపై నిఘా వేశాడు. సాయంత్రం పోచమ్మకు ఫోన్ చేశాడు.

ఫోన్ రెస్పాన్స్ ఇవ్వకపోయే సరికి కృష్ణ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పోచమ్మ లేదు. వెంటనే పక్కనే ఉన్న మాధవరావు ఇంటికి వెళ్లి చూడగా అక్కడ పోచమ్మ మాధవరావులు అర్ధనగ్న శరీరాలతో అభ్యంతరకరమైన పరిస్ధితుల్లో కనిపించారు. కోపోద్రిక్తుడైన కృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అర్ధరాత్రి సమయంలో తిరిగి వచ్చి ఒంటరిగా నిద్రపోతున్న మాధవరావు పై కత్తితో దాడి చేసి, తలపై బండరాయితో మోదీ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *